చరిత్రలో ఈ రోజు 28 మే 2020


 సంఘటనలు
1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

 జననాలు
1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
1921: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, బాలమేధావి అయిన డి.వి. పలుస్కర్ జననం.(మ.1955)
1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996)
[తెలుగు జాతి కీర్తి శిఖరం.. ఎన్టీఆర్ నటునిగా, నాయకునిగా తెలుగుజాతి హృదయాలను గెలుచుకున్నారు నందమూరి తారకరామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యారు. 40 ఏళ్ల పాటు వందలాది సినిమాల్లో నటించిన NTR.. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 9 నెలల్లోనే అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు.]
1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు.
1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

 మరణాలు
1997: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930)
1999: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920)
2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)

 ప్రత్యేక  దినాలు
 నేపాల్ గణతంత్ర దినోత్సవం.
 ఎన్టీఆర్ జయంతి.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28