Posts

Showing posts with the label Education

ప్రధానమంత్రి ( విద్యాలక్ష్మీ ) ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అప్లై చేయండి..

Image
ఆర్థిక పరిస్థితి సరిగా లేని విద్యార్థులకోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఈ లోన్‌ పొందాలంటే వివరాలు ఏంటో తెలుసుకోండి..  ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో 22 వేర్వేరు విద్యారుణాలున్నాయి. లోన్ పొందేందుకు అర్హతలు: ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థుల తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి. లోన్ ఎలా అప్లై చేయాలంటే.. ముందుగా..    Link : http://www.vidyalakshmi.co.in /   వెబ్‌సైట్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మన డీటెయిల్స్‌ని బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు. మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి. ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ ...

ఇంటర్మీడియట్ ఫలితాలు... Websites

Image
#Results తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు... మొదటి సంవత్సరం... http://results.eenadu.net/ts-inter-2020/ts-inter-1st-year-results-2020-general.aspx https://eduresults.sakshi.com/ https://tsbie.cgg.gov.in/ http://bie.telangana.gov.in/ రెండో సంవత్సరం... http://results.eenadu.net/ts-inter-2020/ts-inter-2nd-year-results-2020-general.aspx http://www.sakshieducation.com/ https://tsbie.cgg.gov.in/ http://bie.telangana.gov.in/

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Image
తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను  4,80,555 మంది విద్యార్థులు హాజరుకాగా, 67.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 60శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌ పరీక్షలను 4,11,631 మంది విద్యార్థులు రాయగా, 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం పాసయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేష...

యూజీ పరీక్షలు వాయిదా..

Image
జూలై 12న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష... డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న  నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. యూజీ పరీక్షలు వాయిదా.. అంబేద్కర్‌ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఈడీ (బ్యాక్‌లాగ్‌), ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ (సీబీఎస్‌) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

పదవ తరగతి తర్వాత చదివే కోర్సులకు ముఖ్య తేదీలు వివరాలు..

Image
గ్రికల్చర్ డిప్లొమా మరియు ఇంజనీరింగ్ డిప్లమా ప్రవేశ పరీక్ష (పాలిటెక్నిక్) దరఖాస్తులు సమర్పించడానికి.. చివరి తేదీ 9 జూన్ 2020. పరీక్ష తేదీ 1 జూలై 2020. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు సమర్పించడానికి.. చివరి తేదీ 12 జూలై 2020. పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు. టీఎస్ ఆర్ జె సి ప్రవేశపరీక్ష దరఖాస్తు సమర్పించడానికి... చివరితేదీ 10 జూలై 2020  పరీక్ష తేదీ ఇంకా నిర్ణయించబడ లేదు.

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

Image
RTE - ACT భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009.  ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది.  కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది.  జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది.  ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి .  విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు : అధ్యాయం -1 సెక్షన్-1  చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009  చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.  చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1 సెక్షన్-2 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు  ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు  క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు  స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ...

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

Image
పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పును ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 8 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.
Image
ఏకకాలంలో 25 ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తూ సుమారు రూ.కోటి సంపాదించిన ఓ టీచర్‌ వ్యవహారం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు అనామిక శుక్ల పలు పాఠశాలల్లో పని చేస్తున్నట్లు ఆనలైన్‌ రికార్డుల ద్వారా తెలిసింది. అధికారులు దీనిపై ఆరా తీయగా కస్తురీబా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో పూర్తిస్థాయి టీచర్‌గా పని చేస్తున్న ఆమె పలు జిల్లాల్లోని స్కూళ్లలోనూ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అలాగే అన్ని స్కూళ్లతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలు పాటు కోటి రుపాయలు జీతంగా తీసుకున్నట్లు బయటపడింది. ఆమె ఒకే సమయంలో ఇన్ని స్కూళ్లలో బోధించడం ఎలా సాధ్యమంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది మార్చిలో దీని గురించి ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విషయం బయటపడిన నాటి నుంచి ఆ ఉపాధ్యాయురాలు కనిపించకుండాపోయినట్లు సమాచారం. 

10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్

Image
టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అవసరమా అని ఇప్పటికే హైకోర్టు ( TS High court ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలోనూ హై కోర్టు పలు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించడానికే సిద్ధమైతే మరి కంటైన్మెంట్ జోన్లలో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పరిస్థితేంటని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాసుకోలేకపోయిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. మరి సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ ప్రశ్నలన్నింటికీ రేపు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించిన హై కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హై కోర్టు ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు సమాధానం చెబుతామని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఎస్.ఎస్.సి ఎగ్జామ్స్ రీ...

యూపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌

Image
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2020 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న జరగనుంది. దేశంలో కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదాపడింది. ఈ నేపథ్యంలో సివిల్స్‌తో సహా వివిధ పరీక్షల సవరించిన తేదీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. కొత్త తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లో ఉంచింది. యూపీఎస్సీ సీసీఎస్సీ ప్రధాన పరీక్ష వచ్చే ఏడాది జనవరి 8న జరగనుంది. అదేవిధంగా సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌)-2019 పరీక్షకు సంబంధించిన ఫిజికల్‌ టెస్ట్‌లు జూన్‌ 20 నుంచి జరగనున్నాయి.  ప్రధానమైన పరీక్షలు  ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష (1)- సెప్టెంబర్‌ 6న కంబైండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌- అక్టోబర్‌ 22న సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌- డిసెంబర్‌ 20న ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- 2021, ఫిబ్రవరి 28న ఐఈఎస్‌ లేదా ఐఎస్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌- అక్టోబర్‌ 16న ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామ్‌- ఆగస్టు 9న కంబైండ్‌ జీయో సైంటిస్ట్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- ఆగస్టు 8న జరగనున్నాయి. యూపీఎస్సీ...

బీటెక్‌, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల ప్రతిపాదిత షెడ్యూల్‌ ఇదే..!

Image
జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఈ నెల 20 నుంచి బీటెక్‌, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది.  ఈ నేపథ్యంలో ప్రతిపాదిత షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ‌పరీక్షల షెడ్యూల్‌  వర్సిటీ పరిధిలోని అన్నీ కాలేజీల్లో ఈ నెల 20 నుంచి బీటెక్‌, ఫార్మా, ఇతర కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ తేదీల విషయంలో ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది. ప్రతిపాదిత పరీక్షల షెడ్యూలు: 1. జూన్‌ 20 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ (ఫైనల్‌ ఇయర్‌)- సెకండ్‌ సెమిస్టర్ పరీక్షలు‌, ఎంబీఏ/ఎంసీఏ (సెకండ్‌ ఇయర్‌)- సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ఉంటాయి. 2. జులై 16 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ ఫస్టియర్‌, సెకండ్‌ ఇయర్‌, థర్డ్‌ ఇయర్‌-సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. అలాగే ఫార్మా-డి 2, 3, 4, 5 సెమిస్టర్‌ పరీక్షలు, ఫార్మా-డి (పీబీ) రెండో ఏడాది పరీక్షలు ఉంటాయి. 3. ఆగస్టు 8 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ ఫస్ట్‌ఇయర్‌ నుంచి ఫోర్త్‌ ఇయర్‌ వరకు ఫస్ట్‌ సెమిస్టర్‌, సప్లిమెంటరీ పరీక్షలు, ఎంబీఏ/ఎంసీఏ ఫస్టియర్‌-సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్ పరీక...

గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Image
తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు శుభవార్త. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గడువును పెంచింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ-టిఆర్ఇఐఎస్. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-టిఎస్ఆర్జేసీ సెట్ 2020 పేరుతో ఈ పరీక్ష జరగనుంది. వాస్తవానికి ఈ ఎగ్జామ్ మే 10న జరగాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. పరీక్ష వాయిదా వేయడంతో దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది సొసైటీ. ఆసక్తి గల విద్యార్థులు జూలై 10 వరకు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది. తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం టిఎస్ఆర్జేసీ సెట్ 2020 జరగనుంది. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు.

తెలంగాణలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్షలు.

 కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్‌ 3వ తేదీన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందన్నారు. జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా..  రెగ్యులర్‌గానే పరిగణిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పష్టం చేశారు.

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు.

Image
పాలిసెట్‌ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును వచ్చే నెల 9 వరకు వ్యవసాయ యూనివర్సిటీ పొడిగించింది. ఆలస్య రుసుముతో జూన్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్లు పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ద్వారా మాత్రమే జరుపుతామని వర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు.  పూర్తి వివరాలకు www.polycetts.nic.in , www.sbtet.telangana.gov.in వైబ్‌సైట్‌ చూడవచ్చన్నారు.

విద్యార్థులకు ఇకపై రెండేళ్లకే ఎంసీఏ పట్టా..

Image
ఇప్పటివరకు మూడేళ్లుగా ఉన్న ఎంసీఏ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంసీఏ కోర్సు వివరాలు, తాజా మార్పులు, ప్రవేశ విధానం, అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి 1990వ దశకంలో మూడేళ్ల ఎంసీఏ కోర్సును ప్రవేశపెట్టారు. లేటెస్ట్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును రూపొందించారు. అందుబాటులో ఉన్న పలు సాఫ్ట్ వేర్‌ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్‌ను వేగంగా, సమర్థంగా నిర్వహించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ కోర్సు ప్రధానోద్దేశం. ఎంసీఏలో ప్రతి సబ్జెక్టు కూడా ప్రాక్టికల్స్‌తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నేర్చుకున్న థియరీని వెంటనే ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు.  తాజా మార్పులు! గతంలో ఎంసీఏ కోర్సులో బీఎస్సీ-ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా బీకామ్ తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులే ఎంసీఏలో ఎక...

విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం...

Image
తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం రంగు మారింది..   బ్లూ పాయింట్‌, బ్లూ షర్ట్‌ బదులు.. బ్లూ పాయింట్‌, ఆరెంజ్‌ చెక్స్‌ షర్ట్‌ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న సర్కారు ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకున్నఏకరూప దుస్తులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారంతా నిరుపేద విద్యార్థులు. కానీ ప్రైవేట్‌ పాఠ శాలలకు వెళ్లే విద్యార్థులందరూ ఒకే రకమైన దు స్తులు వేసుకుని వెళ్తుంటే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు నిరాశ చెందే అవకాశం ఉంటుం ది. దీనిని గమనించిన ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూ ప దుస్తులు సరఫరా చేస్తున్నది. జిల్లాలోని 1185 పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూప దు స్తులు అందుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఏక రూప దస్తులు జిల్లాకు చేరాయి. 67,335మంది విద్యార్థులకు.. ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 67,335మంది చి న్నారులకు ప్రభుత్వం ఏక రూప దుస్తులు సరఫ రా చేసింది. ఈ ఏడాది ఆప్కో ద్వారా ఏక రూప దుస్తులు సరఫరా చేస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఏక రూప దుస్తులు ఆయా మండలాల్లోని ...

జూలైలో ద్వితీయ.. ఆగస్టులో ప్రథమ తరగతులు!

Image
కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు.. జూలైలో ఇంటర్‌ సెకండియర్, ఆగస్టులో ఫస్టియర్‌ క్లాసుల్ని ప్రారంభించాలి. విద్యా ఏడాది ఆలస్యంతో ఎన్ని రోజులు నష్టపోతే అన్ని రోజుల సిలబస్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. లేదంటే నష్టపోయిన పనిదినాల్లో సగం ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. మిగతా సగం పాఠాలను సిలబస్‌ నుం చి తొలగించవచ్చా? అనేది చూడాలి. ఈ మేరకు ఇంటర్‌ వార్షిక పరీక్షల్లోనూ వాటిని తొలగించి, ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఎంసెట్‌లోనూ ఆ మేరకు చర్యలు చేపట్టాలి. రెగ్యులర్‌ తరగతుల నిర్వహణలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌కు చర్యలు చేపట్టాలి. కొంతమందికి ఆన్‌లైన్, కొంతమందికి ఆఫ్‌లైన్‌ నిర్వహణను పరిశీలించాలి. లేదంటే ఫస్టి యర్‌ వారికి ఉదయం, సెకండియర్‌ వారి కి మధ్యాహ్నం నిర్వహించవచ్చు. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్‌ వారికి, మరో మూడ్రోజులు సెకండియర్‌ వారికి నిర్వహించవచ్చా? అనేది చూడాలి. ఒకే కోర్సు లోని విద్యార్థులను విభజించి రోజు విడిచి రోజు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణను పరిశీలించాలి. ఆన్‌లైన్‌ బోధనకు వెళ్లే క్రమంలో అందుకు తగిన సదుపాయాలున్నాయో లేవో చూ డాలి. ప్రస్తుతం విద్యార్థులకు ఫోన్లు ఉన్నా యి. ఫోన్‌ విత్‌ డేటా ఉండేలా...

GK

Image
1) బాధ్యత గల అధికారిని తన విధిని నిర్వహించమని  ఆజ్ఞాపిస్తూ న్యాయ స్థానం జారీచే యు ఉత్తర్వు..? జ: మాండ మాస్ 2) ఆ సంబంద్ధ తీర్పును రద్దుపరచడానికి ఎగువ న్యాయ స్థానం జారీ చేయ ఉత్తర్వు జ:  సెర్షియోరారి 3) చట్ట విరుద్ధంగా ఏదేని పదవి కలిగి ఉండటాన్ని  నిరోధిస్తూ న్యాయ స్థానం జారీచే యు ఉత్తర్వు జ:  కోవా రెంటో 4 )భారతదేశంలో మూడు హైకోర్ట్‌లు తొలి సారిగా ఎప్పుడు ఏర్పడ్డాయి? జ:  1862  5.)సుప్రీంకోర్టు, హైకోర్ట్‌ న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చే వ్యవస్థ?  జ:  కొలిజీయం  6 ).కేంద్ర, రాష్ట్రాల మధ్య  జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు  ఏ అధికార పరిధిలోకి వస్తుంది? జ:  ప్రారంభ విచారణాధికారం 7).1927 లొనే వెట్టిని నిర్ములిస్తూ చట్టం చేశారు కానీ అది ఏ నాటికి అంతమైంది జ: 1948  8 )భూ పరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం  జ: .పశ్చిమ బెంగాల్ 9 ) భూ పరిమితి చట్టాన్ని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ శాసన మండలి ఆమోదించింది .జ:సెప్టెంబర్ 1972  10 )  1950లో అమల్లోకి వచ్చిన ఏస్టేట్ బి...

GK

Image
1) ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం? జ: 159 లీటర్లు. (158.987 litres) 1) How many liters of a barrel of oil equals? Ans: 159 Litres. (158.987 litres) 2) పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? జ: 1995. 2) When did the Pulse Polio program begin? Ans: 1995. 3) గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా వెంటనే నాలుక కింద ఏ మందును పెట్టాల్సిందిగా వైద్యులు సూచిస్తారు? జ: యాస్పిరిన్. 3) Doctors usually prescribe which medication to be kept under the tongue immediately after a heart attack? Ans: Aspirin. 4) ఏ మూలకాన్ని ఎకా ర్యాడాన్ అని కూడా పిలుస్తారు? జ: యునునాక్టియం. 4) Which element is also known as Eka Radon? Ans: Ununoctium. Ununoctium is a transactinide chemical element with symbol Uuo and atomic number 118. It was first created by a joint team of American and Russian scientists at the Joint Institute for Nuclear Research in Dubna, Russia. Ununoctium is a temporary name and the suggested name is Oganesson which may be formally accepted by the end of...

టీఎస్‌ సెట్‌ అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

Image
టీఎస్‌ సెట్‌-2020 అన్ని రకాల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం వెలువరించింది. ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తులను ఆలస్య రుసుము లేకుండా జూన్‌ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీఈసెట్‌, ఎడ్‌ సెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌, పీజీ ఈసెట్‌ కు ఈ గడువు పెంపు వర్తించనున్నట్లు పేర్కొంది.