🌏 చరిత్రలో ఈరోజు మే 14


సంఘటనలు

1759: సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారు జిల్లాలన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.

1796: ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.

1845: 'ఉట్రెచ్ట్-అర్నెం' రైల్వే ప్ర్రారంభమయ్యింది.

1853: 'గెయిల్ బోర్డెన్' తను కనిపెట్టిన 'కండెన్స్‌డ్ మిల్క్' చేసే పధ్ధతిని పేటెంట్ గా పొందాడు.

1862: స్విట్జర్లాండ్కి చెందిన 'అడాల్ఫ్ నికోలె' 'క్రోనొగ్రాఫ్' ని పేటెంట్ గా పొందాడు.

1900: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్లో ప్రారంభమయ్యాయి.

1904: మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికా లోని 'సెయింట్ లూయిస్' నగరంలో జరిగింది. (అమెరికా లో, ఇవే మొదటి ఒలింపిక్ క్రీడలు

1908: ప్రయాణీకులతో మొదటి విమానం ఎగిరిన రోజు

1910: కెనడా వెండితో తయారుచేసిన 'డాలర్ నాణెము' లను అధికారికంగా విడుదల చేసింది.

1940: నెదర్లాండ్స్ లోని రోటర్‌డాం నగరం మీద నాజీలు బాంబులు వేయగా 600 నుంచి 900 మంది ప్రజలు మరణించారు. నెదర్లాండ్స్ జర్మనీకి లొంగి పోయింది.

1948: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది. 'డేవిడ్ బెన్ గురియన్' ప్రధానమంత్రి.

1948: ఇజ్రాయెల్ రేడియో స్టేషను 'కోల్ ఇజ్రాయెల్' మొదటిసారిగా తన ప్రసారాలను మొదలుపెట్టింది.

1948: ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా గుర్తించింది.

1960: మనుషులు లేని రోదసీ నౌకను రష్యా దేశం (పాత యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యా) రోదసీ లోకి పంపింది.

1968 : 60వ దశకములో చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాల తర్వాత సైనికులేకాక సామాన్య పౌరులు కూడా సుశిక్షితులై అప్రమత్తంగా ఉండటం అవసరమని గ్రహించి, భారత ప్రభుత్వం పౌర రక్షణ సంస్థను చట్టబద్ధం చేసింది.

1973: అమెరికా సుప్రీం కోర్టు అమెరికా సైన్యంలోని మహిళ లకు సమాన హక్కులు కల్పించింది.

2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.

2012: డాలరుతో రూపాయి మారకం విలువ అతి తక్కువగా రూ 53.96 కి పడిపోయింది. 2012 మే 18 నా

డు, రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.91 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.


జననాలు


1657 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ జననం (మ.1689).

1900: హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు

1926 : నూతి విశ్వామిత్ర, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు .

1946: రాబర్ట్ జార్విక్, వైద్యుడు (కృత్రిమ గుండె జార్విక్ 7ను కనిపెట్టాడు).

1984 : అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ జననం.

1987 : తెలుగు, మళయాళ మరియు హిందీ చిత్రాల నటీమణి మధురిమ జననం.


మరణాలు


1574: గురు అమర్ దాస్ సిక్కుల మూడవ గురువు (జ. 1479).

1956: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (జ.1876)

1991: జియాంగ్ క్వింగ్, చైనా నాయకుడు మావొ సే తుంగ్ భార్య ఆత్మహత్య చేసుకుంది.

1998: పాటగాడు (గాయకుడు), నటుడు ఫ్రాంక్ సినట్రా 82వ ఏట మరణించాడు (జ. 1915)


 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 


పరాగ్వే జాతీయదినోత్సవం. ఈ రోజు స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
అంతర్జాతీయ వలసపక్షుల దినం

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28