GK

1)ఒక వస్తువు త్రిమితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే ‘హోలోగ్రఫీ’ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు?
జ: లేజర్.

2)శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?

జ: సోడియం - 24.

3) ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న పరమాణువులను ఏమంటారు?

  జ: ఐసోటోప్‌లు.

4)కేన్సర్ కణాల నిర్మూలనకు చేసే ‘రేడియోథెరఫీ’ చికిత్సలో ఉపయోగపడే ఐసోటోప్ ఏదీ?

జ: కోబాల్ట్ - 60 

5)రేడియోధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది?
జ: లెడ్.

6) ‘లిటిల్ బాయ్’, ‘ఫ్యాట్ మ్యాన్’ అనేవి..?

జ: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన పరమాణు బాంబుల పేర్లు.

7)  ‘యెల్లో కేక్’ అంటే ఏమిటి?

జ: యురేనియం ఆక్సైడ్.

8) ‘న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్’ ఎక్కడ ఉంది?

జ: హైదరాబాద్.

9)  ‘పరమాణు కేంద్రకం’లో ఉండే కణాలేవి?

జ: ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు.

10)మెదడులోని కణతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది?

జ: అయోడిన్ -131 


11) ‘విధాహసాల భంజిక’ నాటక రచయిత?
  
జ : రాజశేఖరుడు .


12)పచ్చల సోమేశ్వరాలయం ఎక్కడ ఉంది?

జ:  పానగల్లు.

13)కాకతీయుల ‘రాజలాంఛనం’ ఏది?

జ: వరాహం.

14)‘పంచతంత్రం’ గ్రంథాన్ని తెలుగులో ఎవరు రచించారు?

జ: దూబగుంట నారాయణ కవి.

15)‘గజసాహిణి’ అనే బిరుదు ఎవరికి ఉంది?

జ: జాయపసేనాని.

16)మోటుపల్లి అభయశాసనం వేయించిన కాకతీయ రాజు ఎవరు?

జ: గణపతిదేవుడు.

17)తెలంగాణాలో ‘వీరశైవ మతం’ ప్రవేశించడానికి మూలకారకుడెవరు?

 జ: మల్లికార్జున పండితుడు.

18)వరంగల్ నగర వర్ణన ఉన్న గ్రంథం ఏది?

జ: క్రీడాభిరామం.

19)కాకతీయుల కాలంలో ‘మోటుపల్లి’ రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు?

జ: మార్కోపోలో.

20)‘లెంకలు’ అంటే?
జ:  రాజు అంగరక్షకులు.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28