చరిత్ర లో ఈరోజు మే 10


 సంఘటనలు 
1267: అందరూ యూదులను గుర్తించటానికి వీలుగా ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని వియెన్నా లోని చర్చి ఆదేశించింది.

1278: ఇంగ్లాండ్ లోని యూదులను చెఱసాలలో బంధించారు.

1427: స్విట్జర్‌లాండ్ లోని బెర్న్ నుంచి యూదులను బహిష్కరించారు.

1497: ఇటాలియన్ నేవిగేటర్ అమెరిగో వెస్పుస్సి నూతన ప్రపంచాన్ని కనుగొనటానికి తన మొదటి యాత్రను మొదలు పెట్టాడు.

1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.

1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

1908 – మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది..

1930: అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.

1933: నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.

1940: చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.

1950: నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు.

1960: అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.

1963: పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే

1964: జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.

1967: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.

1969: అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.

1972: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.

1976: బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది.

1983: అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి .

1984: ఇథియోపియాకి అత్యవసర సహాయంగా యూరోప్ ఉదారంగా సహాయం చేసింది.


1993 : రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొదటి స్త్రీ సంతోష్ యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.

1994: నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.

2001: బ్రిటన్ లో గత 20 సంవత్సరాలు కన్నా తక్కువ క్రైమ్ రేట్లు నమోదు అయ్యాయి.

2002: భారత లోక్‌సభ సభాపతి గా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు.

2005: గూగుల్ వార్తలు, శోధన పద్ధతి కొరకు పేటెంట్ అడిగింది. అందువలన నాణ్యత గలిగిన వార్తల వెబ్ సైట్ల లింకులు దొరికాయి.

2006: టైటానిక్ నౌక ప్రమాదంలో బతికి బట్ట కట్టిన, చివరి అమెరికా పౌరుడు మరణించాడు.

2006: సెక్స్ వెబ్ సైట్లకు .xxx డొమైన్ పేరు తగిలించాలన్న విన్నపాన్ని ఐ.సి.ఎ.ఎన్.ఎన్ ICANN తిరస్కరించింది.

2007: మొదటి ప్రపంచయుద్ధంలో బతికి బట్ట కట్టిన ఒకే ఒక్క వీరుడు కెనడాలో ఇంకా బతికి వున్నడు.

2010: చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు.

2010: రష్యా తన విజయ దినాన్ని జరుపుకుంది.

2011: పరువు హత్యలలో (పరువు, మర్యాద లేదని, అవి హత్యలేనని భారతదేశపు న్యాయ స్థానం వెల్లడించింది. (తమ పరువు పోతుందని, తమ ఇంటిలోని ఆడవారిని హత్యలు చేయటమె పరువు హత్య)

జననాలు 

1661: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (మ.1713)

1855: శ్రీయుక్తేశ్వర్ గిరి - ఆధ్యాత్మిక గురువు. ది హోలీ సైన్స్ రచయిత. (మ.1936)

1922: కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (మ. 1922)

1978: ఉపద్రష్ట సునీత, గాయని, డబ్బింగ్ కళాకారిణి.

1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం

1986: పెండ్యాల హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు.

 మరణాలు 

1787: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (జ.1715)

1936: పినపాల వెంకటదాసు, తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత.(జ.1870)

1992: కె.జి.రామనాథన్, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త. (జ.1920)

1787 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విల్లియం వాట్సన్ మరణం.(జ. 1715)

1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)

2002 :తెలుగు, తమిళ, మలయాళ సినిమా నటి దేవిక మరణం (జ.
  
 💐జాతీయదినోత్సవాలు 

May 2 వ ఆదివారం. ఆంగ్ల  మాతృ దినోత్సవం ఇది భారతీయ సంస్కృతి కాదు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం