చరిత్రలో ఈ రోజు 21 మే 2020
సంఘటనలు 1819: మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు. 1829: సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు. 1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు). 1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు. 1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది. 1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)). 1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది. 1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది. జననాలు 0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథ