కేంద్రీయ వర్సిటీలో యూజీలు.. పీజీలు..! నోటిఫికేషన్‌ విడుదల..


కేంద్రీయ వర్సిటీలో యూజీలు.. పీజీలు!
నాణ్యమైన విద్యకు, వసతులకు సెంట్రల్‌ యూనివర్సిటీలు ప్రసిద్ధి. వీటికి నిధుల కొరత లేకపోవడంతో దాదాపు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే చాలామంది ఈ సంస్థల్లో చేరడానికి ఎదురు చూస్తుంటారు. ఆసక్తి ఉన్న అలాంటి అభ్యర్థుల నుంచి గురుఘాసిదాస్‌ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన గురు ఘాసిదాస్‌ విశ్వవిద్యాలయం, బిలాస్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

కేంద్రీయ వర్సిటీలో యూజీ కోర్సులు

  • బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫారెస్ట్రీ, ఆంత్రపాలజీ, బయో టెక్నాలజీ, రూరల్‌ టెక్నాలజీ.
  • బీఏ ఆనర్స్‌: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, ఇంగ్లిష్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఆంత్రోపాలజీ, హిందీ
  • బీకాం ఆనర్స్‌, బీఫార్మసీ, బీఎల్‌ఐఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీఎడ్‌, బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, బీపీఎడ్‌.


కేంద్రీయ వర్సిటీలో పీజీ కోర్సులు


  • ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫారెస్ట్రీ, రూరల్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆంత్రపాలజీ.
  • ఎంఏ: పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ.
  • ఎంకాం, ఎంసీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఎడ్‌, ఎంపీఈడీ



అర్హత: యూజీ కోర్సులకు 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్ఛు కొన్ని కోర్సులకు సంబంధిత సబ్జెక్టులను ఇంటర్‌లో చదివుండాలి. పీజీలకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో యూజీ ఉత్తీర్ణులు అర్హులు. కొన్నింటికి ఏదైనా యూజీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్ఛు ఇంటర్‌, యూజీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారూ అర్హులే.

వయసు: యూజీ కోర్సులకు 22 సంవత్సరాలు, పీజీ కోర్సులకు 25 ఏళ్లలోపు వయసు ఉండాలి.

కోర్సును బట్టి రాత పరీక్షలు నిర్వహిస్తారు. అందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి. రుణాత్మక మార్కులు లేవు. 

వెబ్‌సైట్‌: http://ggu.ac.in

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 30

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: విశాఖపట్నం

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం