ముఖ్యమం‍త్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌


 దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ సడలింపు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు.  ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. రాష్ట్రాల వారిగా కోవిడ్‌ నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా మోదీ ఇవ్వనున్నారు. 

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రత్యక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

నిన్నటి వరకూ గ్రీన్‌ జోన్‌.. ఇవాళ 4 పాజిటివ్‌

నిన్నటి వరకు ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్‌లో ఉన్న యాదాద్రి జిల్లాలో తాజాగా కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. జిల్లాలో తొలిసారిగా ఒకేరోజు నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆత్మకూరు(ఏం) మండలం పల్లెర్లలో ముగ్గురికి, సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా వీరందరూ ఈ నెల 5వ తేదీన ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులు. పల్లెర్ల నుంచి మరో ఆరుగురిని, జనగాం నుంచి మరో నలుగురిని బిబినగర్ నిమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం