విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం...



  • తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం రంగు మారింది..  
  • బ్లూ పాయింట్‌, బ్లూ షర్ట్‌ బదులు.. బ్లూ పాయింట్‌, ఆరెంజ్‌ చెక్స్‌ షర్ట్‌
  • విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న సర్కారు
  • ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకున్నఏకరూప దుస్తులు


ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారంతా నిరుపేద విద్యార్థులు. కానీ ప్రైవేట్‌ పాఠ శాలలకు వెళ్లే విద్యార్థులందరూ ఒకే రకమైన దు స్తులు వేసుకుని వెళ్తుంటే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు నిరాశ చెందే అవకాశం ఉంటుం ది. దీనిని గమనించిన ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూ ప దుస్తులు సరఫరా చేస్తున్నది. జిల్లాలోని 1185 పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూప దు స్తులు అందుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఏక రూప దస్తులు జిల్లాకు చేరాయి.

67,335మంది విద్యార్థులకు..
ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 67,335మంది చి న్నారులకు ప్రభుత్వం ఏక రూప దుస్తులు సరఫ రా చేసింది. ఈ ఏడాది ఆప్కో ద్వారా ఏక రూప దుస్తులు సరఫరా చేస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఏక రూప దుస్తులు ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ కార్యాలయాలకు చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ రూర ల్‌, అర్బన్‌, మావల, బేలా, జైనథ్‌, తలమడుగు, తాంసి, భీంపూర్‌, బజార్‌ హత్నూర్‌, బోథ్‌, నేరడిగొండ మండలాలకు వస్ర్తాలు చేరాయి. మిగితా మండలాలకు రెండు రోజుల్లోపు సరఫరా చేయనున్నట్లు ఆప్కో అధికారులు పేర్కొన్నారు.

మారిన రంగు...

ఈ ఏడాది వచ్చిన ఏక రూప వస్త్రం రంగు మారిం ది. గత ఏడాది బ్లూ పాయింట్‌, బ్లూ గీతలతో కూ డిన షర్ట్‌ ఉండేది. ఈ ఏడాది బ్లూ పాయింట్‌, ఆ రెంజ్‌ చెక్స్‌తో కూడిన షర్ట్‌ బట్టను ఆప్కోవారు పంపించారు. జిల్లాలోని 1185 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే 35,724 బాలురు, 31,611 బాలికలకు రెండు జతల ఏక రూప వస్ర్తాన్ని సరఫరా చేయనున్నారు. వీరికి స్టి చ్చింగ్‌ చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కో జతకు రూ.50చొప్పున ప్రభుత్వం ప్రతి ఏ డాది నిధులు మంజూరు చేస్తున్నది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బాలికలకు షర్ట్‌, స్కర్ట్‌, బాలురకు నిక్కర్‌, అంగి, 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాయింట్‌, షర్ట్‌, బాలికలకు పం జా బీ డ్రెస్‌లు కుట్టుకునేందుకు అవసరమైన బట్ట ను ఆయా పాఠశాలల సంఖ్యను బట్టి ఎమ్మార్సీ కేం ద్రాల నుంచి పాఠశాలలకు పంపనున్నారు.

మొదటి రోజే వస్త్రం అందజేస్తాం..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు బడు లు ప్రారంభమైన మొ దటి రోజే అందించేందుకు ఏర్పాటు చేస్తు న్నాం. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులు అందిస్తాం. కుట్టు చార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు ఉండాలి. మా పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ దుస్తులతో పా టు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తాం.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)