జూన్‌ 8 నుంచి టెన్త్‌ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..!


జూన్ 8 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎస్‌సి పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ
హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది.

    వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 తర్వాత నుంచి పదో
తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష 
కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు 
తెలిపారు. జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని 
ఆదేశించింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని
ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కనుక కరోనా 
నివారణ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని టీఎస్ సర్కార్‌కి సూచించింది హైకోర్టు. 

    అలాగే ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు పేర్కొంది. టెన్త్ క్లాస్
పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి
హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 పరీక్షల సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పదో తరగతి పరీక్షల నిర్వహణకు మార్గం 
సుగమమయింది. ఇప్పటికే రెండు పరీక్షలు జరగ్గా.. ఇంకా నాలుగు పరీక్షలు 
ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం