జూన్‌ 20 నుంచే డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు!

               డిగ్రీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌ 20 లేదా 22 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చాయి. పరీక్షల నిర్వహణపై యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణ శనివారం ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు జరుపుకోవాలని యూజీసీ ఇటీవల సూచించింది. 15 రోజుల్లో పూర్తి కావడం కష్టమని, ఐచ్ఛిక సబ్జెక్టులు ఎక్కువగా ఉంటాయని, మూల్యాంకనమూ సమస్య అవుతుందని భావించి.. సుమారు 10 రోజులు ముందుగా పరీక్షలు ప్రారంభించాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. యూజీసీ సూచించిన పరీక్ష సమయం 2 గంటలకు కుదింపు, ప్రశ్నపత్రం విధానంలో మార్పులు, ఛాయిస్‌ పెంచడం, వ్యక్తిగత దూరం పాటించడంపై రిజిస్ట్రార్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని వారికి పాపిరెడ్డి సూచించారు.

Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020