చరిత్రలో ఈ రోజు 21 మే 2020


సంఘటనలు
1819: మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.
1829: సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.
1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు).
1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు.
1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది.
1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).
1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.
1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది.

 జననాలు
0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?)
1688: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)
1893: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.
1941: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.
1961: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015)
1991: జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు

 మరణాలు
◾1786: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)
◾1940: కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908)
◾1991: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944)
◾2018: యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940)
◾2019: బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925) 

జాతీయదినోత్సవాలు 

  • జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.
  • సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు)
  • ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఇంటర్నేషనల్)

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)