రైతులు, వలస కార్మికులు, చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వెండార్లకు లబ్ది.. నిర్మలా సీతారామన్


కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ రెండో రోజైన గురువారం ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, స్ట్రీట్ వెండార్లకు ప్రయోజనం కల్గించే పలు రాయితీలను ప్రకటించారు. మొత్తం 9  సూత్రాల ఫార్ములా కింద 3 కోట్ల మంది రైతులకు 4.2 లక్షల కోట్ల రుణాలను అందించినట్టు చెప్పారు. 25 లక్షల మంది కొత్త కిసాన్ కార్డు హోల్డర్లకు 25 వేల కోట్ల రుణాలు ఇస్తున్నట్టు ఆమె వివరించారు. వలస కార్మికులు, స్వయం సహాయక బృందాలవారికి, చిన్న వ్యాపారులకు పేదలకు ఈ భారీ ప్యాకేజీ వల్ల లబ్ది కలుగుతుందన్నారు.

నిర్మలాసీతారామన్ ప్రకటించిన ముఖ్యాంశాల్లో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
  • జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కార్మికుల వేతనాలు రూ. 182 నుంచి 202 కి పెంపు
  • గత నెల 3 న ప్రభుత్వం అడ్వాన్సుగా అన్ని రాష్ట్రాలకు 1102 కోట్లను తన కంట్రిబ్యూషన్ గా అందజేసింది
  • మార్చి 20 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు వ్యవసాయ ప్రొక్యూర్ మెంట్ కోసం మూలధన పెట్టుబడిగా 6,700 కోట్లు మంజూరు
  • 3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్ల రుణాలు మంజూరు.. మూడు నెలల మారటోరియం
  • 25 వేల కోట్ల లోన్ లిమిట్ తో కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు
  • దేశంలో 7200 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఏర్పాటు
  • రూరల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం 4,200 కోట్ల సపోర్ట్ తో నాబార్డ్ 29,500 కోట్లను రీఫైనాన్స్ చేసింది
  • 86 వేల కోట్ల విలువైన 63 లక్షల రుణాలు  వ్యవసాయ రంగం కింద ఆమోదం
  • రైతు రుణాలపై ఇంట్రెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ మే 31 వరకు పొడిగింపు
  • రెంటల్ హొసింగ్ కాంప్లెక్సుల ఏర్పాటు
  • సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే  రుణాలు
  • గ్రామీణ మౌలిక వసతులకు రూ. 4200 కోట్లు
  • వలస కార్మికుల ఉపాధికి రూ. 10 వేల కోట్లు
  • రేషన్ కార్డు లేనివారికి పది కిలోల బియ్యం, శనగలు
  • ప్లాట్ ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకం
  • ఈ-రేషన్ కార్డుతో ఎక్కడైనా సరకులు తీసుకునే వెసులుబాటు
  • వలసకార్మికులు, వీధి వ్యాపారులపై స్పెషల్ ఫోకస్
  • వచ్ఛే రెండు నెలలు వలస కూలీలకు ఉచిత రేషన్

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం