సీఎం కేసీఆర్ చెప్పిన కీలక విషయాలివే


తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినేట్ భేటి ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు తెలిపారు..

  • తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ 
  • కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లు గ్రీన్ జోన్లే.
  • కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు. 
  • 1452 కుటుంబాలు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నాయి. 
  • హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో బస్సులు తిరుగుతాయి. సిటీ బస్సులకు అనుమతి లేదు. 
  • వేరే రాష్ట్రాల బస్సులకు తెలంగాణలో అనుమతి లేదు. తెలంగాణ బస్సులు వేరే రాష్ట్రానికి పోవు. 
  • హైదరాబాద్ లో ఆటోలు,క్యాబ్ లకు అనుమతి. 
  • క్యాబ్ లలో డ్రైవర్ తో పాటు ముగ్గురికి అనుమతి.
  • ఆటోలలో డ్రైవర్ తో పాటు ముగ్గురికి అనుమతి.
  • కంటైన్మెంట్ మినహా అన్ని ప్రాంతాల్లో అన్ని ఓపెన్ చేసుకోవచ్చు  
  • జిల్లాల నుంచి వచ్చిన బస్సులు జూబ్లీ బస్టాండ్ కు అనుమతి.ఇమ్లీమన్ కు అనుమతి లేదు. 
  • మే 31 వరకు మెట్రో రైళ్లు రద్దు.
  • కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో ఆటోలు,క్యాబ్ లు,బస్సులకు అనుమతి.
  • కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో సెలూన్ షాపులు తెరుచుకోవచ్చు.  
  • ఈ-కామర్స్ సంస్థలు,స్విగ్గీ,జుమాటోలకు అనుమతి.
  •  ఫంక్షన్ హాల్స్, థియేటర్లు, మత ప్రార్థనలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదు.
  • విద్యా సంస్థలకు మే 31 వరకు అనుమతి లేదు. 
  • బార్లు, పబ్‌లు, పార్క్‌లు, జిమ్, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు అనుమతి లేదు.
  • రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగింపు.
  • ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు 100 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చు. 
  • అంతా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలి. లేకపోతే జరిమానా తప్పదు. 
  • రాత్రివేళల్లో కర్ఫ్యూ యథాతధంగా కొనసాగుతుంది. అన్ని కార్యాలయాలు తమ కార్యకలాపాలను నడపుకోవచ్చు.
  • పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చు
  • హైదరాబాద్ లో దుకాణాలు సరి బేసి విధానంలో తెరుచుకుంటాయి. 
  • తెలంగాణలో రైతులు 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండించాలి. 
  • వర్షాకాలంలో మక్క పంటకు బదులు కంది పంట వేసుకోవాలి. 
  • 40 లక్షల ఎకరాల్లో వరిపంట వేయాలి. 
  • తెలంగాణ కాటన్ పంటకు అద్భుతమైన భవిష్కత్ ఉంది. పత్తి చేను పెంచుదాం. 
  • గత సంవత్సరం 53 లక్షల ఎకరాల్లో పత్తిపంట పండింది.
  •  నిజామాబాద్,జగిత్యాలలో పసుపు పంట వేసుకోవాలి. 
  • 15 లక్షల ఎకరాల్లో కంది పంట వేసుకోవాలి. 
  • ఆదిలాబాద్, నిజామాబాద్ లలో సోయాబిన్ వేసుకోవచ్చు. 
  • ఇష్టమున్న పంట వేస్తే రైతుబంధు కట్. ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు.
  •  జిల్లాల వారీగా ఏ పంట వేయాలనేది త్వరలోనే అధికారుల నిర్ణయం. 
  • కంది పంట వేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 
  • నియంత్రిత విధానంలో కొత్త పంటలు పండించేందుకు కొత్త విధానం.
  • 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలి. 
  • త్వరలో న్యూస్‌ ఛానల్‌ ద్వారా రైతులతో ముఖాముఖి.  
  • 2604 వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు. 
  • ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లకు అనుమతి. 
  • కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్‌.
  • కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ. 
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.  
  • పోతిరెడ్డిపాడు గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. 
  • మా పరిధిలోనే మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. 
  • గోదావరిలో ఉన్న మిగులు జలాలను రాయలసీమకు తీసుకెళ్లాలి.
  • ఏపీతో విబేధాలు లేవు. మేం కలిసే పని చేస్తాం. కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదు. 
  • మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా. భౌతిక దూరం తప్పనిసరి.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం