జులై 12న బీఆర్‌ఏవోయూ-2020 అర్హత పరీక్ష..


 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏవోయూ)-2020 అర్హత పరీక్షను జులై 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షను ఏప్రిల్‌ 19న నిర్వహించాల్సి ఉండే. కానీ లాక్‌డౌన్‌ కారణంగా అర్హత పరీక్షను వాయిదా వేశారు. ఇక అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రథమ సంవత్సరం(మొదటి సెమిస్టర్‌)(సీబీసీఎస్‌) పరీక్షలను జూన్‌ 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీల మధ్య నిర్వహించాల్సి ఉండే. ఇతర వివరాల కోసం 040-23680240/241/291 లేదా www.braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.


Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)