నీట్‌ దరఖాస్తులో కరెక్షన్స్‌కు చివరి అవకాశం


 దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్ష అయిన నీట్‌ దరఖాస్తులో మార్పులు చేర్పులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మరో అవకాశం కల్పించింది. కరోనా నేపథ్యంలో ఇదే చివరి అవకాశమని ఎన్‌టీఏ ప్రకటించింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పామ్‌లో అభ్యర్థులు తమ ఫొటో, పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవచ్చని వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఇప్పటివరకు మూడుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మరోమారు లాక్‌డౌన్‌ పొడిగింపునకు సంబంధించి త్వరలో ప్రకటించనుంది. దీంతో నీట్‌, జేఈఈ, నెట్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షలతోపాటు అనేక ప్రవేశపరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)