Posts

Showing posts with the label MCA

విద్యార్థులకు ఇకపై రెండేళ్లకే ఎంసీఏ పట్టా..

Image
ఇప్పటివరకు మూడేళ్లుగా ఉన్న ఎంసీఏ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంసీఏ కోర్సు వివరాలు, తాజా మార్పులు, ప్రవేశ విధానం, అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి 1990వ దశకంలో మూడేళ్ల ఎంసీఏ కోర్సును ప్రవేశపెట్టారు. లేటెస్ట్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును రూపొందించారు. అందుబాటులో ఉన్న పలు సాఫ్ట్ వేర్‌ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్‌ను వేగంగా, సమర్థంగా నిర్వహించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ కోర్సు ప్రధానోద్దేశం. ఎంసీఏలో ప్రతి సబ్జెక్టు కూడా ప్రాక్టికల్స్‌తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నేర్చుకున్న థియరీని వెంటనే ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు.  తాజా మార్పులు! గతంలో ఎంసీఏ కోర్సులో బీఎస్సీ-ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా బీకామ్ తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులే ఎంసీఏలో ఎక...