IMEI' నెంబర్ ఏలా తెలుసుకోవాలి ?


దాని వల్ల ప్రయోజనాలు ?

ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ స్టేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఈఐ) నెంబర్ తప్పనిసరిగా కేటాయిస్తారు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్  (ఎఫ్ఐఆర్) పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ పాత్ర కీలకం. దేశవ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు. యూఎస్ఎస్‌డి కోడ్ ద్వారా: ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునేందుకు సులువైన పద్ధతి. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. ఐఎమ్ఈఐ నెంబర్‌ ఫోన్ పై ఎక్కడ ఉంటుంది..? మీరు ఐఫోన్ 5 లేదా ఆఫై వర్షన్ ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే డివైస్ బ్యాక్ ప్యానల్ పై ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు. ఐఫోన్ 4ఎస్ లేదా పాత వర్షన్ ఐఫోన్‌లను వాడుతున్నట్లయితే సిమ్ ట్రే పై ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు.ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తెలుసుకోవాలంటే..? ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > About > IMEIలోకి వెళ్లటం ద్వారా ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం