కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది...- భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్
భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. ప్రైవేట్ వినియోగం దారుణంగా పడిపోయిందని చెబుతూ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. అంటే, ఇప్పుడున్న 4.4 శాతం నుంచి రెపో రేట్ 4 శాతానికి తగ్గుతుందని శక్తికాంత దాస్ అన్నారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు, మార్చి 27న కూడా ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేయడం రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను నిరర్థకంగా అటి పెట్టుకోకుండా ఉండేలా చేసేందుకు రివర్స్ రెపో రేటును కూడా 3.75 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఇప్పుడు మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా, మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థికరంగం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలల వ్యవధిలో ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసిన మూడో మీడియా సమావేశం. ఆర్‌బీఐ గవర్...