తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు ఫలితాలు త్వరలోనే..


జూన్ రెండో వారంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా..ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభించింది. జవాబు పత్రాల కోడింగ్ పూర్తి చేసిన అధికారులు.. మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు.
ప్రతి రోజు 15 వేల మంది లెక్చరర్లతో 30 రోజుల పాటు 33 కేంద్రాల్లో మూల్యాంకన ప్రక్రియను చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ముందుగా ఇంటర్ సెకండియర్ జవాబు పత్రాలను దిద్ది, ఆ తర్వాత ఫస్టియర్ పేపర్లు వాల్యుయేషన్ చేయనున్నారు. ఒక్కో అధ్యాపకుడికి 45 పేపర్లు అందించి, పది నిమిషాల వ్యవధిలో ఒక్కో పేపర్ దిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు.
జూన్ 2వ వారంలో ఎంసెట్ కన్నా ముందే సెకండియర్ ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. ఆ రెండు, మూడు రోజుల తర్వాత ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామన్నారు.
కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వాల్యుయేషన్ సెంటర్‌లో లెక్చరర్లు భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒమర్ జలీల్ వివరించారు. కాగా, ఒకేషనల్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 15న ప్రారంభిస్తామని, ఇంకా వాటి కోడింగ్ ప్రక్రియ చేపట్టలేదని ఆయన వెల్లడించారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం