Posts

Showing posts with the label TelanganaFormationDay

తెలంగాణ అవతరణ దినోత్సవం: విలీనం నుంచి విభజన దాకా...

Image
నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం 2014లో తెలంగాణ ప్రజల ఆంకాంక్ష నెరవేరింది. ఆంధ్రతో హైదరాబాద్ ప్రాంతం విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1948: నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) పోలీస్ చర్య‌తో భారత్‌లో విలీనం అయింది. అప్పటి నుంచి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. 1956: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది. పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్ మెన్ అగ్రిమెంట్)తో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1969: పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. పోలీసుల కాల్పుల్లో 300 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్...