చరిత్ర పుటల్లో ఈ రోజు మే 19..


సంఘటనలు

1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం)

1927 : సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.

1944 : అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.

1990 : మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.

1991 : సోవియట్ ప్రభుత్వం, దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకునే తన పౌరులను, దేశం వదిలిపోవటానికి అనుమతించింది.

జననాలు

1890: హొ చి మిన్, అమెరికాను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు. ఇతని మరణానంతరం, వియత్నాం రాజధాని పేరును హో చి మిన్ సిటీగా మార్చారు.

1894: గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979)

1908: మానిక్ బందోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956)

1908: జేమ్స్ స్టీవర్ట్, అమెరికన్ నటుడు.

1910: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)

1913: నీలం సంజీవరెడ్డి, భారత 6వ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి.(మ.1996)

1915: మోషే డయాన్, ఇజ్రాయల్ సైనిక అధికారి.

1934: పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.

1938 : ప్రముఖ రచయిత,నటుడు,సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం. (మ.2019)

1946: చెర్, అమెరికన్ నటి.


1955 : కంప్యూటర్ శాస్త్రవేత్త , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వాడు అయిన జేమ్స్ గోస్లింగ్ జననం.

మరణాలు

1904 : భారత దేశంలో పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త, పారిశ్రామిక రంగ పురోగమనంలో ప్రముఖుడు జమెశెడిజ్జి టాటా మరణం (జ.1839)

1970: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. (జ.1894)

1952: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878)

1985: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913)

2008: విజయ్ టెండూల్కర్, రచయిత మరణం (జ.1928). 

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)