జప్తు చేసిన వాహనాలు తిరిగిచ్చేయాలి: డీజీపీ

నిబంధనల ఉల్లంఘన కారణంగా జప్తు చేసిన వాహనాల విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జప్తు చేసిన వాహనాలకు జరిమానా విధించి తిరిగి ఇచ్చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసులకు ఆదేశించారు. వేల సంఖ్యలో జప్తు చేసిన వాహనాలను భద్రపరిచే విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి బాండు రాయించుకుని వాహనాలను తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు డీజీపీ సూచించారు. పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించే వాహనదారుల నుంచి బాండు రాయించుకోవాలని, అయితే, కోర్టు కేసు యథాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డీజీపీ ఆదేశించారు

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)