లాక్ డౌన్ సమయంలో పూర్తి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు


  • ఉద్యోగులకు కేంద్ర సర్కార్ షాక్
  • తాజా ఉత్తర్వు జారీచేసిన ప్రభుత్వం
 ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర సర్కార్ షాకిచ్చింది. కోవిడ్-19 డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకూ పూర్తి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీలు, కమర్షియల్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీచేసింది. కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా కంపెనీలు పనిచేయక పోయినా.. ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలంటూ హూం వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్) మార్చి 29న ఉత్తుర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రతి ఉద్యోగి పనికి వెళ్ళడం సాధ్యంకాని విధంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న సమయంలో ఈ నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పుడు, ఈ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఉద్యోగులపై ప్రభావం...
భారతదేశంలోని ఉద్యోగులందరికీ ఇది ప్రతికూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తాజా ఆదేశాలను సాకుగా చూపించి.. యపమని తమ ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయడం, లేదా తక్కువ చెల్లించాలని కోరుకుంటారు. అలాగే పూర్తి జీతం చెల్లించనందుకు, లేదా అలస జీతం చెల్లించకపోయినా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉద్యోగి కోల్పోయినట్టే.

కోర్టు ఏం చెప్పింది?

కరోనా వైరస్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల్లో కోత విధించకుండా ఐటీ కంపెనీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది. 5 అలాగే మార్చి 20న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్, మార్చి 29న హోంశాఖ నోటిఫికేషన్ పై కర్నాటకకు చెందిన ఫికస్ పాక్స్ ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై స్పందించిన సుప్రీం ఈ కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేని సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాగే మార్చి 29న ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని అసోసియేషన్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. లా డౌన్ సమయంలో ఆదాయంలేని చిన్న కంపెనీలు వేతనాలు చెల్లించలేకపోతున్నాయని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై సమావేశం జరగాల్సి వుందనీ, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుఫాన్ మెహతా కోర్టుకు వివరించారు.నేపథ్యంలో మంగళవారం తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28