ఇంటర్ ప్రవేశాలు చేపడితే చర్యలు
♦️పది పరీక్షలు పూర్తికాలేదని... కళాశాలలకు అనుబంధ గుర్తింపు కూడా ఇవ్వనందున వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపట్టవద్దని ఇంటర్‌బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతి రద్దు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.