జూన్ 15 నుంచి టెన్త్ పరీక్షలు !

15వరకు ఎంసెట్ గడువు

తెలంగాణ ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును అపరాధ రుసుం లేకుండా మే 15 వరకు పొడిగించారు. ఎంసెట్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచి మొదలైంది


జూన్ 15 నుంచి టెన్త్ పరీక్షలు !

     కరోనాతో వాయిదా పడిన పదోతరగతి పరీక్షలను జూన్ 15 నుంచి నిర్వహించేందుకుపాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మార్చి19న ప్రారంభమై 3పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదావేసిన విషయంతెలిసిందే . ఇంకా 8 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది


జూన్ మూడో వారంలో డిగ్రీ , ఇంజనీరింగ్ పరీక్షలు

  • తొలుత ఫైనలియర్ విద్యార్థులకు
  • డిటెన్షన్ విధానం ఎత్తివేత

        
అన్ని వర్సిటీల పరిధిలో 
డిగ్రీ , ఇంజనీరింగ్ పరీక్షలను జూన్ మూడో వారంలో నిర్వహిం చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది . కరోనా నేపథ్యంలో తొలుత వైనలియర్ విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది . అలాగే ఫస్టియర్ , సెకండియర్ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని , విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని వర్సిటీలు అంగీకరించాయి . శనివారం వర్సిటీల రిజిస్టార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి , వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు నిర్ణయించారు. జూలైలో పరీక్షలు నిర్వహించుకోవాలని యూజీసీ సూచించింది . రాష్ట్రంలో పరిస్థితి 
కాస్త మెరుగైనందున వారం , పది రోజులు ముందుగానే పరీ 
క్షలు నిర్వహించాలని భావిస్తున్నారు . ఇక పరీక్షల సమయం తగ్గింపు , ఆన్లైన్ తరగతులు , ఇతర అంశాలపై యూజీసీమార్గదర్శకాలఅమలుసాధ్యాసాధ్యాలపై ప్రిన్సిపాల్స్ , డీ 'చర్చించి వారంలో బదులివ్వాలని వర్సిటీలకు సూచించింది.

Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020