సారీ మేం పని చేయలేం: అంగన్‌వాడీలు


కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నా.. తమకు ప్రోత్సాహకాలు లేకున్నా.. కనీసం గుర్తింపునివ్వడం లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము పని జేయలేమని ఏకంగా మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య ముందు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో వారు తమ ఆవేదనను కమిషనర్‌కు వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైన తర్వాత ఆశాలు, ఏఎన్‌ఎంలతో పాటు అంగన్‌వాడీలు కూడా క్షేత్రస్థాయిలో పనిజేస్తున్నారు. వీరిని ఇంటింటి సర్వే కోసం వినియోగిస్తున్నారు.

అంగన్‌వాడీ  కేంద్రం పరిధిలో ఉండే ఇళ్లలో ప్రతిరోజూ 30-50 ఇళ్లకు వెళ్లడం, ఇంటింటి వివరాలతో పాటు, ఎవరికైనా జ్వరం ఉందా? ఇతర జబ్బులతో బాధపడుతున్నారా అన్న అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ తమపై అధికారులకు పంపుతున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాపై పోరు చేస్తున్న సిబ్బందికి 10ు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. అందులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, మునిసిపల్‌ సిబ్బంది ఉండగా, అంగన్‌వాడీలకు మాత్రం ఇన్సెంటివ్‌ అందలేదు. పైగా వీరి జీతాల్లోనూ కోతపడింది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం