తెలంగాణలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్షలు.

 కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్‌ 3వ తేదీన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందన్నారు. జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్‌గానే పరిగణిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పష్టం చేశారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం