1.రాజ్య సభ మొట్ట మొదటి సమావేశం 28 ఏళ్ల క్రితం 1952 లో ఏ తేదీన జరిగింది?
మే 13 

2.ద్రవ్య బిల్లుకు రాజ్యసభ సవరణలు ప్రతిపాదించి కానీ ప్రతిపాదించకుండా కానీ లోక్సభకు ఎన్ని రోజుల్లో తిప్పి పంపాలి ?
14

3.రాష్ట్ర జాబితాలోని అంశాల పై చట్టాలు చేయడం కొత్త అఖిల భారత సర్వీసులు సృష్టించడం వంటి  కొన్ని ప్రత్యేక అధికారాలు పార్లమెంటులోని ఏ భాగం కలిగి ఉన్నది ?
రాజ్యసభ 

4.1949లో రాజ్యాంగ నిర్మాణ సభలో చర్చలో పార్లమెంటులో రెండో సభ ఉండనవసరం లేదు అనే భావన బలంగా వినిపించింది.రెండు సభ సామ్రాజ్యవాద ఆవశ్యకమని ప్రజోపయోగ చట్టాలు మోకాలడ్డటం తప్ప అది మీరు ఏమీ చేయలేదనే ప్రతికూల వాదన గట్టిగా ముందుకొచ్చి ఇలా ఎనిమిది రోజులపాటు వాదప్రతివాదనలు తర్వాత రాజ్యసభ ఆవశ్యకత గురించి ఎవరు చేసిన వాదనలు గెలిచాయి?
ఎం.అనంతశయనం అయ్యంగార్ &ఎస్.గోపాలస్వామి అయ్యంగార్   

5.రాజ్యసభ కాలవ్యవధి ఏది ?
నిర్విరామం  

6.భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి?
 1952 

7.1952 మే 13 నుంచి ఎంత వరకు రాజ్యసభ మొత్తం 5,772 సార్లు సమావేశమై ఎన్ని బిల్లులను ఆమోదించింది?
3,857

8.కొన్ని చట్టాల పై రెండు సభలకు బేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి అధికారం ఉంది?
అధికరణ 108 

9.చట్టాలపై భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పిలుపుమేరకు జరిగే సమీక్ష సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు?
 లోక్ సభ స్పీకర్ 

10.కరోనా మహమ్మారి నుంచి  కోరుకున్న వారిలో ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలైన 113 సంవత్సరాల మరియా బ్రన్యాస్  ఏదేశం ?
స్పెయిన్ 

11.ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఏ నగరంలో ఉంది?
దుబాయ్ 

12.మానవ శరీరంలో రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తులలోకి ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ను రక్తంలోనికి మార్పిడి చేసి అత్యంత కీలకమైన పని నిర్వర్తించే అతి సూక్ష్మమైన బుడగల ఆకారాల్లో ఉండే గాలిగదుల ను ఏమంటారు ?
ఆల్వి యోలై

13.ఫీపా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ఏ దేశంలో నిర్వహించనున్నారు?
 ఇండియా.

14.స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్-2020లో భారత్ మధ్య ఆసియాలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన ఎయిర్పోర్ట్ ఏది?
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ 

15.పంచదార సిమెంటు విద్యుత్తు విభాగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ కె సి పి లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?
 vl indira dutt

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం