Posts

Showing posts with the label Jobs

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి చర్యలు

Image
తెలంగాణ జిల్లాలో ఖాళీగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. జడ్పీలో అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు ఖమ్మం కలెక్టరేట్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న 60 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. రోస్టర్‌ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు ఆహ్వానించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో డీపీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాలైన సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు, పెనుబల్లి, సత్తుపల్లి (పాక్షికంగా) మండలాల్లో స్థానిక ఎస్టీ అభ్యర్థులతో 12 పోస్టుల భర్తీ చేసేందుకు ఇటీవలే అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి, వారిని ఎంపిక చేశారు. మైదాన ప్రాంతంలో 47 పోస్టుల భర్తీకి ప్రతిభ ఆధారం...

అవసరమైన ఖాళీలను భర్తీ చేయండి

Image
అన్ని దవాఖానల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఎంతమంది అవసరం అవుతారో నివేదిక రూపొందించి, అవసరమైన ఖాళీలను భర్తీచేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరో నా కేసుల సంఖ్యపై శుక్రవారం తన కార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో స మీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై ప్రజ లు భయాందోళన చెందొద్దని, వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..

Image
 రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 2,000లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ. 5 వేలు జీతం లభిస్తోంది. కాగా.. పంచాయితీ కార్యదర్శి విధిగా.. గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు. సర్పంచ్‌ యొక్క ఆదేశంతో గ్రామపంచాయతీ సమావేశాలను నెలకు ఒక్కసారైనా నిర్వహించాలి. గత సమావేశం జరిగిన నాటి నుంచి 90 రోజుల గడువులోపు మరో సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీనికి సర్పంచ్‌ ఆమోదం తెలియజేయకపోతే కార్యదర్శి తనంతట తానే సమావేశం నిర్వహించవచ్చు.

లాక్ డౌన్ సమయంలో పూర్తి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు

ఉద్యోగులకు కేంద్ర సర్కార్ షాక్ తాజా ఉత్తర్వు జారీచేసిన ప్రభుత్వం  ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర సర్కార్ షాకిచ్చింది. కోవిడ్-19 డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకూ పూర్తి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీలు, కమర్షియల్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీచేసింది. కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా కంపెనీలు పనిచేయక పోయినా.. ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలంటూ హూం వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్) మార్చి 29న ఉత్తుర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రతి ఉద్యోగి పనికి వెళ్ళడం సాధ్యంకాని విధంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న సమయంలో ఈ నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పుడు, ఈ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఉద్యోగులపై ప్రభావం... భారతదేశంలోని ఉద్యోగులందరికీ ఇది ప్రతికూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తాజా ఆదేశాలను సాకుగా చూపించి.. యపమని తమ ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయడం, లేదా తక్కువ చెల్లించాలని కోరుకుంటారు. అలాగే పూర్తి జీతం చెల్లించనందుకు, లేదా అలస జీతం చెల్లించకపోయినా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉద్యోగి కోల్పోయినట్టే. కోర్టు ఏం చెప్పింది?...

10th పాస్ అయితే చాలు..రైల్వే లో ఉద్యోగాలు..

Image
భారతీయ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పారామెడికల్, మెడికల్ ప్రాక్టీషనర్ల పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ 19 వార్డుల్లో పనిచేసేందుకు ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 62 ఖాళీలున్నాయి. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. దరఖాస్తు చేయడానికి 2020 మే 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. Integral Coach Factory Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే నర్సింగ్ సూపరింటెండెంట్- 24 మొత్తం ఖాళీలు- 62 హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 24 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 12 ఫిజీషియన్- 2 దరఖాస్తుకు చివరి తేదీ : 2020 మే 17 సాయంత్రం 5.30 గంటలు విద్యార్హతలు : వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో అర్హతలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్ :  Click Here వెబ్సైట్ :   C lick Here   (apply link) *Note :  ఆసక్తి గల అభ్యర్థులు దరఖ...