తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి చర్యలు




తెలంగాణ జిల్లాలో ఖాళీగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది.


జడ్పీలో అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు


ఖమ్మం కలెక్టరేట్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న 60 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. రోస్టర్‌ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు ఆహ్వానించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో డీపీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాలైన సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు, పెనుబల్లి, సత్తుపల్లి (పాక్షికంగా) మండలాల్లో స్థానిక ఎస్టీ అభ్యర్థులతో 12 పోస్టుల భర్తీ చేసేందుకు ఇటీవలే అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి, వారిని ఎంపిక చేశారు. మైదాన ప్రాంతంలో 47 పోస్టుల భర్తీకి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఒక పోస్టు భర్తీకి న్యాయ పరమైన అడ్డంకులు ఏర్పడటంతో ఆ పోస్టులో భర్తీ తాత్కాలికంగా నిలిపేశారు.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28