చరిత్రలో ఈ రోజు మే 30.


సంఘటనలు

1962: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.

1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.

2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.

జననాలు

1903: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973)

1921: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం

1960 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు హరికిషన్ జననం


1970 : భారతీయ వ్యాపార సంస్థాపకుడు మరియు వ్యాపారవేత్త నెస్ వాడియా జననం

1987: అల్లు శిరీష్, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్ కుమారుడు.

మరణాలు

1744: అలెగ్జాండర్ పోప్, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)

2007: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1927)

2010: బలరాం నందా, భారత చరిత్రకారుడు.

2013 : బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్ర దర్శకుడు ఋతుపర్ణ ఘోష్ మరణం (జ.1963)

2017: దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942)

పండుగలు , జాతీయ దినోత్సవాలు.

గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం