ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువులు


ఎఫ్ ఆర్ ఐ కి గడువు మే 26

  • ఎఫ్ ఆర్ ఐ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. నిజానికి ఈ నెల 10న ఎంట్రెన్స్ టెస్ట్ జరగాల్సి ఉంది. పరీక్ష తేదీని తరవాత వెల్లడిస్తారు.


నాటా వాయిదా

  • దేశవ్యాప్తంగా ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నాటా (నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్) 2020 రెండో దశ పరీక్షను వాయిదా వేసినట్లు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రకటించింది. ఈ పరీక్ష మే 31న జరగాల్సి ఉంది. కొత్త షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తారు.


నెట్ దరఖాస్తులో సడలింపు
  • సిఎస్ఐఆర్ యుజిసి నెట్ దరఖాస్తు ప్రక్రి యను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఏ) సడలించింది. ఆన్ లైన్ దరఖాస్తు గడువు తేదీని మే 15 వరకు పొడిగించింది. అలాగే యుజిసి నెట్ గడువు తేదీని మే 16 వరకు పెంచింది. అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ల అప్ లోడ్ కు  మినహాయింపు ఇచ్చింది

జూలై 29 నుంచి విట్ ప్రవేశ పరీక్షలు
  • వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 124 కేంద్రాల్లో జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తారు.

జూన్ 5 వరకు ఆయుష్
  • పీజీ కోర్సుల దరఖాస్తులు ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ వంటి వైద్య విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎఐ ఎపిజిఇటి)కు దరఖాస్తు ప్రక్రియను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రారంభించింది. దరఖా స్తుకు చివరి తేదీ జూన్ 5. పరీక్ష తేదీలను మే 15 తరవాత ప్రకటించనున్నట్లు పేర్కొంది.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)