వరుసగా 3నెలల రేషన్ తీసుకోని వారి ఖాతాలో కూడా నగదు జమ


కరోనా ప్రభావంతో తెలంగాణ సర్కార్ తెల్ల రేషన్ కలిగిన ప్రతి ఒక్కరికి కరోనా సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయం కింద రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి 12 కిలోల ఉచిత బియ్యం, ప్రతి కార్డు దారునికి రూ.1500 నగదు సాయం అందజేశారు. ఏప్రిల్,మే నెలకు సంబంధించి దీనిని అమలు చేశారు. అయితే వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకొని వారికి ఈ సాయాన్ని అందించలేదు. దాదాపు 2 లక్షల 8వేల మంది కార్డుదారులు కరోనా సాయాన్ని పొందలేకపోయారు. అధికారులకు వారి నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మానవతా కోణంలో ఆలోచించి వారికి కూడా సాయాన్ని అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో వారి ఖాతాలో కూడా రెండు నెలల సాయం రూ.3000 జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 13 జూన్ 2020

10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)