200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం...
కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ విధించిన తర్వాత ఆగిపోయిన రైల్వే సేవలను జూన్ 1 నుంచీ మళ్లీ కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, ఇవాళ్టి నుంచి టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 1 నుంచీ దేశవ్యాప్తంగా 200 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారత రైల్వే బుధవారం రాత్రి ప్రకటించింది. జోన్లు, మార్గాల ప్రకారం వచ్చే నెల నుంచి నడవనున్న రైళ్లు, వాటి టైం టేబుల్‌ను అన్ని జోన్ల డీజీలకు పంపించింది. ప్రధానంగా కరోనా లాక్‌డౌన్ సడలింపులతో భారీగా సొంత ప్రాంతాలకు తరలుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ప్రత్యేకంగా కొన్ని మార్గాల్లో రైళ్లను తిరిగి ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి రోజూ రాకపోకలు సాగించనున్న ఎక్స్ ప్రెస్ రైళ్లుు : ముంబయి-హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్ ప్రెస్ (02701/02), హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ (02703/04), హైదరాబాద్- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ (02723/24), దానాపూర్- సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92), విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ 02805/06) గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎ...