మే 18న CBSE పరీక్షల డేట్‌షీట్ రిలీజ్‌..!


 లాక్‌డౌన్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన CBSE 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల మరోసారి వాయిదాపడింది. మే 18న (సోమవారం) సీబీఎస్ఈ పరీక్షల డేట్‌షీట్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఉదయం కూడా ఒక ప్రకటన చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల సీబీఎస్ఈ డేట్‌షీట్ విడుదలను ఈ నెల 18కి వాయిదా వేశామని శనివారం సాయంత్రం మరో ప్రకటన చేసింది. హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, జూలై 1 నుంచి 15 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది.
అయితే ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందనే సమగ్ర వివరాలతో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం