చరిత్రలో ఈ రోజు జూన్ 10


సంఘటనలు

1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.

1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.

జననాలు

1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)

1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.

1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)

1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)

1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.

1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.

1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011)

1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.

మరణాలు

1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)

1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు,  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)

1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత

2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)

2019: గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)

పండుగలు, జాతీయ దినోత్సవాలు

పోర్చుగల్ జాతీయదినోత్సవం

సమయపాలనను ఖచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.

Popular posts from this blog

GK

GK