Posts

Showing posts from May, 2020

Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 31.05.2020)

Image
District wise status update on # Coronavirus positive cases in Telangana Today New cases-199 Active Cases-1188 Total Discharged-1428(Today-16) Total Deaths-82(Today-5) Total Positive Cases-2698

తెలంగాణలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్షలు.

 కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్‌ 3వ తేదీన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందన్నారు. జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా..  రెగ్యులర్‌గానే పరిగణిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు..

Image
రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎం సి.ఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు.

GK

Image
1) ఫోటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం ఏది? జ: సిల్వర్ బ్రోమైడ్. 1) Which chemical is used in photography? Ans: Silver bromide. 2) సౌందర్య సాధనాలలో వాడే జింక్ సమ్మేళనం ఏది? జ: ZnCO3. 2) Which  is a zinc compound used in cosmetics? Ans: ZnCO3. 3) ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటి మీద పెయింట్ వేసే పద్ధతి ని ఏమంటారు? జ: గాల్వనైజేషన్. 3) What is the method by which iron tubes are painted on them without corrosion? Ans: Galvanization. 4) అమృతాంజన్ వంటి నొప్పి నివారణలలో ఉపయోగించే ఆమ్లం ఏది? జ: శాలిసిలిక్ ఆమ్లం. 4) Which acid is used in pain relievers like Amritanjan? Ans: Salicylic acid. 5) వాహనాల టైర్ల తయారీలో ఉపయోగించే కార్బన్ యొక్క రూపం ఏది? జ: కార్బన్ బ్లాక్. 6) వింటర్ తైలం అని దేనిని పిలుస్తారు? జ: శాలిసిలిక్ ఆమ్లం. 6) Which is called Oil of winter green  ? Ans: Salicylic acid. 7) గాజు పాత్రల పై చిత్రీకరించుటకు ఉపయోగించే ఆమ్లం ఏది? జ: HF- హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం. 7) Which acid is used to paint on  glass containers? Ans: HF-hydr...

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు.

Image
పాలిసెట్‌ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును వచ్చే నెల 9 వరకు వ్యవసాయ యూనివర్సిటీ పొడిగించింది. ఆలస్య రుసుముతో జూన్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్లు పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ద్వారా మాత్రమే జరుపుతామని వర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు.  పూర్తి వివరాలకు www.polycetts.nic.in , www.sbtet.telangana.gov.in వైబ్‌సైట్‌ చూడవచ్చన్నారు.

విద్యార్థులకు ఇకపై రెండేళ్లకే ఎంసీఏ పట్టా..

Image
ఇప్పటివరకు మూడేళ్లుగా ఉన్న ఎంసీఏ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంసీఏ కోర్సు వివరాలు, తాజా మార్పులు, ప్రవేశ విధానం, అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి 1990వ దశకంలో మూడేళ్ల ఎంసీఏ కోర్సును ప్రవేశపెట్టారు. లేటెస్ట్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును రూపొందించారు. అందుబాటులో ఉన్న పలు సాఫ్ట్ వేర్‌ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్‌ను వేగంగా, సమర్థంగా నిర్వహించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ కోర్సు ప్రధానోద్దేశం. ఎంసీఏలో ప్రతి సబ్జెక్టు కూడా ప్రాక్టికల్స్‌తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నేర్చుకున్న థియరీని వెంటనే ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు.  తాజా మార్పులు! గతంలో ఎంసీఏ కోర్సులో బీఎస్సీ-ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా బీకామ్ తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులే ఎంసీఏలో ఎక...

చరిత్ర లో ఈరోజు మే 31.

Image
సంఘటనలు 526 : టర్కీ లో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది 1970: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి. 1986: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి. 2002: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి. జననాలు 1725 : మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జననం (మ.1795). 1911: మారిస్ అలైస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2010). 1930 : సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ జననం 1942: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు సభ్యుడు. మరణాలు 1964: దువ్వూరి సుబ్బమ్మ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880). 1985: సముద్రాల రామానుజాచార్య, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923). పండుగలు , జాతీయ దినోత్సవాలు. 🚬🚫ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

చరిత్రలో ఈ రోజు మే 30.

Image
సంఘటనలు 1962: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి. 1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం. జననాలు 1903: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973) 1921: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. 1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం 1960 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు హరికిషన్ జననం 1970 : భారతీయ వ్యాపార సంస్థాపకుడు మరియు వ్యాపారవేత్త నెస్ వాడియా జననం 1987: అల్లు శిరీష్, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్ కుమారుడు. మరణాలు 1744: అలెగ్జాండర్ పోప్, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688) 2007: గ...

GK

Image
1) భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షుడు? జ: మొరార్జీ దేశాయ్. 1) Who was the first President of the Administrative Reforms Commission of India? Ans: Morarji Desai. 2) కేంద్ర, రాష్ర్ట సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షుడు? జ: జస్టిస్ ఎం.ఎం.పూంచి. 2) Who is the President of the Commission appointed by the Central Government for the study of Central and State Relations? Ans: Justice M.M. Punchi. 3) జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? జ: ఉమ్మడి జాబితా. 3) What is the list of the Constitution that prohibits animal cruelty? Ans: Common List. 4) అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ? జ: రాజమన్నార్ కమిషన్. 4) Which committee recommended the abolition of All India Services, especially IAS and IPS? Ans: Rajamannar Commission. 5) కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి? జ: పార్లమెంటు. 5) Who should make an offer to ...

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి చర్యలు

Image
తెలంగాణ జిల్లాలో ఖాళీగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. జడ్పీలో అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు ఖమ్మం కలెక్టరేట్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న 60 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. రోస్టర్‌ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు ఆహ్వానించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో డీపీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాలైన సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు, పెనుబల్లి, సత్తుపల్లి (పాక్షికంగా) మండలాల్లో స్థానిక ఎస్టీ అభ్యర్థులతో 12 పోస్టుల భర్తీ చేసేందుకు ఇటీవలే అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి, వారిని ఎంపిక చేశారు. మైదాన ప్రాంతంలో 47 పోస్టుల భర్తీకి ప్రతిభ ఆధారం...

విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం...

Image
తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం రంగు మారింది..   బ్లూ పాయింట్‌, బ్లూ షర్ట్‌ బదులు.. బ్లూ పాయింట్‌, ఆరెంజ్‌ చెక్స్‌ షర్ట్‌ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న సర్కారు ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకున్నఏకరూప దుస్తులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారంతా నిరుపేద విద్యార్థులు. కానీ ప్రైవేట్‌ పాఠ శాలలకు వెళ్లే విద్యార్థులందరూ ఒకే రకమైన దు స్తులు వేసుకుని వెళ్తుంటే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు నిరాశ చెందే అవకాశం ఉంటుం ది. దీనిని గమనించిన ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూ ప దుస్తులు సరఫరా చేస్తున్నది. జిల్లాలోని 1185 పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూప దు స్తులు అందుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఏక రూప దస్తులు జిల్లాకు చేరాయి. 67,335మంది విద్యార్థులకు.. ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 67,335మంది చి న్నారులకు ప్రభుత్వం ఏక రూప దుస్తులు సరఫ రా చేసింది. ఈ ఏడాది ఆప్కో ద్వారా ఏక రూప దుస్తులు సరఫరా చేస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి గాను ఏక రూప దుస్తులు ఆయా మండలాల్లోని ...

జూలైలో ద్వితీయ.. ఆగస్టులో ప్రథమ తరగతులు!

Image
కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు.. జూలైలో ఇంటర్‌ సెకండియర్, ఆగస్టులో ఫస్టియర్‌ క్లాసుల్ని ప్రారంభించాలి. విద్యా ఏడాది ఆలస్యంతో ఎన్ని రోజులు నష్టపోతే అన్ని రోజుల సిలబస్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. లేదంటే నష్టపోయిన పనిదినాల్లో సగం ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. మిగతా సగం పాఠాలను సిలబస్‌ నుం చి తొలగించవచ్చా? అనేది చూడాలి. ఈ మేరకు ఇంటర్‌ వార్షిక పరీక్షల్లోనూ వాటిని తొలగించి, ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఎంసెట్‌లోనూ ఆ మేరకు చర్యలు చేపట్టాలి. రెగ్యులర్‌ తరగతుల నిర్వహణలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌కు చర్యలు చేపట్టాలి. కొంతమందికి ఆన్‌లైన్, కొంతమందికి ఆఫ్‌లైన్‌ నిర్వహణను పరిశీలించాలి. లేదంటే ఫస్టి యర్‌ వారికి ఉదయం, సెకండియర్‌ వారి కి మధ్యాహ్నం నిర్వహించవచ్చు. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్‌ వారికి, మరో మూడ్రోజులు సెకండియర్‌ వారికి నిర్వహించవచ్చా? అనేది చూడాలి. ఒకే కోర్సు లోని విద్యార్థులను విభజించి రోజు విడిచి రోజు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణను పరిశీలించాలి. ఆన్‌లైన్‌ బోధనకు వెళ్లే క్రమంలో అందుకు తగిన సదుపాయాలున్నాయో లేవో చూ డాలి. ప్రస్తుతం విద్యార్థులకు ఫోన్లు ఉన్నా యి. ఫోన్‌ విత్‌ డేటా ఉండేలా...

చరిత్ర లో ఈరోజు..మే 29

Image
సంఘటనలు 1947 :రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ చర్చి, బిషప్ గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది. 1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు. జననాలు 1900: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987) 1903: బాబ్ హోప్, ప్రపంచ పేరొందిన హాస్యజీవి. (మ.2003) 1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002) 1917: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963) 1925: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010) 1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, సంపాదకుడు. 1947: రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా, (అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్). 1952: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018) 1980...

చరిత్రలో ఈ రోజు 28 మే 2020

Image
 సంఘటనలు 1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.  జననాలు 1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953) 1921: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, బాలమేధావి అయిన డి.వి. పలుస్కర్ జననం.(మ.1955) 1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996) [తెలుగు జాతి కీర్తి శిఖరం.. ఎన్టీఆర్ నటునిగా, నాయకునిగా తెలుగుజాతి హృదయాలను గెలుచుకున్నారు నందమూరి తారకరామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యారు. 40 ఏళ్ల పాటు వందలాది సినిమాల్లో నటించిన NTR.. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 9 నెలల్లోనే అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు.] 1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు. 1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క...

GK

Image
1) బాధ్యత గల అధికారిని తన విధిని నిర్వహించమని  ఆజ్ఞాపిస్తూ న్యాయ స్థానం జారీచే యు ఉత్తర్వు..? జ: మాండ మాస్ 2) ఆ సంబంద్ధ తీర్పును రద్దుపరచడానికి ఎగువ న్యాయ స్థానం జారీ చేయ ఉత్తర్వు జ:  సెర్షియోరారి 3) చట్ట విరుద్ధంగా ఏదేని పదవి కలిగి ఉండటాన్ని  నిరోధిస్తూ న్యాయ స్థానం జారీచే యు ఉత్తర్వు జ:  కోవా రెంటో 4 )భారతదేశంలో మూడు హైకోర్ట్‌లు తొలి సారిగా ఎప్పుడు ఏర్పడ్డాయి? జ:  1862  5.)సుప్రీంకోర్టు, హైకోర్ట్‌ న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చే వ్యవస్థ?  జ:  కొలిజీయం  6 ).కేంద్ర, రాష్ట్రాల మధ్య  జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు  ఏ అధికార పరిధిలోకి వస్తుంది? జ:  ప్రారంభ విచారణాధికారం 7).1927 లొనే వెట్టిని నిర్ములిస్తూ చట్టం చేశారు కానీ అది ఏ నాటికి అంతమైంది జ: 1948  8 )భూ పరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం  జ: .పశ్చిమ బెంగాల్ 9 ) భూ పరిమితి చట్టాన్ని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ శాసన మండలి ఆమోదించింది .జ:సెప్టెంబర్ 1972  10 )  1950లో అమల్లోకి వచ్చిన ఏస్టేట్ బి...

GK

Image
1) ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం? జ: 159 లీటర్లు. (158.987 litres) 1) How many liters of a barrel of oil equals? Ans: 159 Litres. (158.987 litres) 2) పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? జ: 1995. 2) When did the Pulse Polio program begin? Ans: 1995. 3) గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా వెంటనే నాలుక కింద ఏ మందును పెట్టాల్సిందిగా వైద్యులు సూచిస్తారు? జ: యాస్పిరిన్. 3) Doctors usually prescribe which medication to be kept under the tongue immediately after a heart attack? Ans: Aspirin. 4) ఏ మూలకాన్ని ఎకా ర్యాడాన్ అని కూడా పిలుస్తారు? జ: యునునాక్టియం. 4) Which element is also known as Eka Radon? Ans: Ununoctium. Ununoctium is a transactinide chemical element with symbol Uuo and atomic number 118. It was first created by a joint team of American and Russian scientists at the Joint Institute for Nuclear Research in Dubna, Russia. Ununoctium is a temporary name and the suggested name is Oganesson which may be formally accepted by the end of...

చరిత్ర లో ఈరోజు మే 27

Image
సంఘటనలు 1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన 1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. 1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు. జననాలు 1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406) 1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983) 1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016). 1943: క్రొవ్విడి బలరామమూర్తి. 1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత. 1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక. మరణాలు 1910: జర్మనీ కి చేందిన రాబర్ట్ కోచ్ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843). 1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848) 1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908). 1964: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889) 1980: సాలూరు హనుమంతరావు,...

Covid 19 in Telangana (Updated on 26.05.2020)

Image
తెలంగాణలో మరో 71 కరోనా కేసులు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో 71 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1991కి చేరింది. రాష్ట్రంలో నేడు 120 మంది డిశ్చార్జ్ అవగా..  ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు మొత్తం 1284 మంది డిశ్చార్జి కాగా..  వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 650 మంది చికిత్స పొందుతున్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 57 మంది మరణించారు. 

టీఎస్‌ సెట్‌ అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

Image
టీఎస్‌ సెట్‌-2020 అన్ని రకాల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం వెలువరించింది. ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తులను ఆలస్య రుసుము లేకుండా జూన్‌ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీఈసెట్‌, ఎడ్‌ సెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌, పీజీ ఈసెట్‌ కు ఈ గడువు పెంపు వర్తించనున్నట్లు పేర్కొంది.

హెచ్‌సీయూ ప్రవేశాల గడువు జూన్‌ 30 దాకా

Image
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల దరఖాస్తులను జూన్‌ 30 వరకు పెంచారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మే 22తో గడవు తేదీ ముగియనుంది. అయితే కొవిడ్‌-19 కారణంగా దరఖాస్తు గడువు జూన్‌ 30 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. 132 కోర్సుల్లో ప్రవేశానికి మొత్తం 2,456 సీట్లు ఉన్నాయని తెలిపారు.

వరుసగా 3నెలల రేషన్ తీసుకోని వారి ఖాతాలో కూడా నగదు జమ

కరోనా ప్రభావంతో తెలంగాణ సర్కార్ తెల్ల రేషన్ కలిగిన ప్రతి ఒక్కరికి కరోనా సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయం కింద రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి 12 కిలోల ఉచిత బియ్యం, ప్రతి కార్డు దారునికి రూ.1500 నగదు సాయం అందజేశారు. ఏప్రిల్,మే నెలకు సంబంధించి దీనిని అమలు చేశారు. అయితే వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకొని వారికి ఈ సాయాన్ని అందించలేదు. దాదాపు 2 లక్షల 8వేల మంది కార్డుదారులు కరోనా సాయాన్ని పొందలేకపోయారు. అధికారులకు వారి నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మానవతా కోణంలో ఆలోచించి వారికి కూడా సాయాన్ని అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో వారి ఖాతాలో కూడా రెండు నెలల సాయం రూ.3000 జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

GK

Image
1) ఏ నిజాం రాజు ‘ఉద్యోగుల సాధారణ జాబితా’ విడుదల చేశారు? జ: మహబూబ్ అలీఖాన్. 1) Which Nizam's King released the 'General List of Employees'? Ans: Mahboob Ali Khan. 2) . ‘జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి’ స్థాపకులెవరు? జ: సేఠ్ లాల్‌జీ మేఘ్‌జీ. 2) Who was the founder of the 'Biosafety Knowledge compaign Board'? Ans:Seth Lalji Meghji. 3) తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల, తెలుగు పత్రికలు ప్రచురణలు చేసింది? జ: రామానుజాచార్యులు. 3) who published first English and Telugu magazines in telangana? Ans: Ramanujacharya. 4) తెలుగు ‘మీజాన్’ పత్రిక సంపాదకులు? జ: అడవి బాపిరాజు. 4)Who is the editor of 'Meezan' magazine in Telugu? Ans: Adavi Bapiraju. 5) ‘తెలుగు తల్లి’ పత్రిక ప్రచురించినవారు? జ: రాచముళ్ల సత్యవతి. 5)Who published the magazine 'Telugu Mother'? Ans: Rachamulla Satyavati. 6) ‘చార్మినార్ గాసిప్’ శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి? జ: శోభ. 6) In ...

చరిత్రలో ఈ రోజు 26 మే 2020

Image
సంఘటనలు 1894: రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు. 1938: దేనా బ్యాంకు స్థాపించబడింది. 1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది. 1972: అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి. 1986: యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది. 2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది. 2014: భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.  జననాలు 1928: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (మ.2003) 1937: మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015) 1942: గణపతి సచ్చిదానంద, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం. 1946: అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత 1949: వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. 1945: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012) 1955: పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు. 1956: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని మండలి బుద్ధ ప్ర...

అవసరమైన ఖాళీలను భర్తీ చేయండి

Image
అన్ని దవాఖానల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ఎంతమంది అవసరం అవుతారో నివేదిక రూపొందించి, అవసరమైన ఖాళీలను భర్తీచేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరో నా కేసుల సంఖ్యపై శుక్రవారం తన కార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో స మీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై ప్రజ లు భయాందోళన చెందొద్దని, వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఒకేసారి రెండు డిగ్రీలు ప్రతిపాదనకు యూజీసీ గ్రీన్‌సిగ్నల్‌..

Image
త్వరలో నోటిఫికేషన్‌ జారీ ఒకటి రెగ్యులర్, రెండోది డిస్టెన్స్‌ విధానంలో అనుమతి  దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అనుమతించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కమిషన్‌ ఆమోదించింది. త్వరలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇకపై దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. అయితే రెండూ ఒకేసారి రెగ్యులర్‌ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్‌లైన్లో దూరవిద్య(ఓఎల్‌డీ) ద్వారా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని యూజీసీ అభిప్రాయపడింది.  కొత్త విధానంలో విద్యార్థులు ఒకే సంస్థ లేదా వేర్వేరు సంస్థల ద్వారా ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను అభ్యసించగలుగుతారు. ఈ మేరకు యూజీసీ అనుమతి ఇచ్చిందని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏకకాలంలో ద్వంద్వ డిగ్రీల కోసం వచ్చిన ప్రతిపాదనను ఇటీవల జరిగిన కమిషన్‌ సమావేశంలో ఆమోదించారని చెప్పారు. దీనికి సంబంధి...

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

Image
క‌రోనా వైర‌స్, లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్రంలో వాయిదా ప‌డిన‌ పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ మొదటి వారంలో పరీక్షలు నిర్వ‌హించుకోవ‌చ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల వరకు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులందరూ భౌతిక దూరం పాటించేలా పరీక్ష హాల్లో చర్యలు తీసుకోనున్నారు. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆద...