EAMCET, NEET, IIT-JEE‌కి ఫ్రీ కోచింగ్ ఆన్ లైన్లో...

EAMCET, NEET, IIT-JEEకి సిద్ధమయ్యే వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ ఆన్ లైన్ వీడియో కోచింగ్ క్లాసులను తీసుకొచ్చిందిఈ ఆన్ లైన్ వీడియో క్లాసులను అటెండ్ అవ్వాలనుకునే వారు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.

EAMCET, NEET, IIT-JEEకి ప్రిపేర్ అయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ సంక్షేమ జూనియర్ కాలేజీ విద్యార్థులు, ఇతర విద్యార్థుల కోసం డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్టులను కూడా నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో ఈ టెస్టులను నిర్వహిస్తారు. CloudEdz Pvt Ltd సహకారంతో టెస్టులు నిర్వహించనున్నారు.

వీటికి సంబంధించిన ఆన్ లైన్ పరీక్షల షెడ్యూల్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. డైలీ టెస్టుల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. గ్రాండ్ టెస్టుల్లో ఫైనల్ ఎగ్జామ్ తరహాలో 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పరీక్ష పేపర్ విద్యార్థుల కోసం 36 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. (ఉదయం 6 గంటల నుంచి తర్వాత రోజు సాయంత్రం 6 గంటల వరకు) మిగిలిన షెడ్యూల్ మే 4 తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుంది.

 దీనికి సంబంధించి ఏమైనా వివరాలు కావాలనుకుంటే.. 9299994866 ఫోన్ నెంబర్‌లో (ఉదయం 10.30 నుంచి సాయంత్రం5 లోపు) సంప్రదించవచ్చు.ఆన్ లైన్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులు ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. tscie.rankr.io లింక్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. యూజర్‌ ఐడీ, పాస్ వర్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. అందులోకి లాగిన్ అయిన తర్వాత అందులో వివరాలు ఉంటాయి.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం