మే నెలలో పరీక్షలేం ఉండవు

♦️ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే మే నెలలో ఎలాంటి ప్రవేశ, సెమిస్టర్‌ పరీక్షలు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మే ఏడు వరకు లాక్‌డౌన్‌ ఉండటం, ఆపై పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక మూడు నాలుగు వారాల సమయం అవసరం అవుతున్నందున మే నెలలో ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం సాధారణ పరిస్థితులను బట్టే పరీక్షల నిర్వహణ ఉంటుందని చెప్పారు. డిగ్రీ ఫలితాలతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షలను డిగ్రీ పరీక్షలయ్యాక జరుపుతామన్నారు. ముందుగా డిగ్రీతో సంబంధం లేని ఎంసెట్‌, ఈసెట్‌ను నిర్వహిస్తామన్నారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులను పరీక్షల ఫలితాలతో సంబంధం లేకుండా పై సెమిస్టర్‌కు అనుమతించాలని భావిస్తున్నామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలకు సిలబస్‌ తగ్గించే ఆలోచన ఉందన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాల పైనే పరీక్షలు జరుపుతామని పాపిరెడ్డి వివరించారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం