RTE - ACT భారతదేశం లో : 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే Right to Free a-d Compulsory Education- Act 2009. ఈ విద్యాహక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నాయి . విద్యాహక్కు చట్టం ముఖ్యాంశాలు : అధ్యాయం -1 సెక్షన్-1 చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం 2009 చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది. చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ 1 సెక్షన్-2 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ...
సంఘటనలు 1819: మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు. 1829: సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు. 1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు). 1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు. 1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది. 1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)). 1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది. 1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది. జననాలు 0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథ...
దిల్లీ: దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా వ్యాప్తికి ప్రజ్వలన కేంద్రాలు (హాట్స్పాట్స్)గా గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.207 జిల్లాలను నాన్ హాట్స్పాట్ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్జోన్లోనూ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ బారిన పడిన వారిలో 11.41 శాతం మంది కోలుకున్నారని తెలిపారు.దేశవ్యాప్తంగా కొవిడ్-19 హాట్స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్స్పాట్ కేంద్రాలు, గ్రీన్జోన్లను గుర్తించామని లవ్ అగర్వాల్ తెలిపారు. హాట్స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఏప్రిల్ 20 తర్వాత హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. భారత్లో ఇప్పటి వరకు సామాహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి కరోనా వైరస్ చేరలేదని, కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉంద...