డిజిటల్ మోదీ! ‘ఈ-గ్రామ్ స్వరాజ్ ’ పోర్టల్ ప్రారంభం
📱మొబైల్ ఫోన్లలోనూ గ్రామ సమాచారం
న్యూఢిల్లీ,
దేశంలోని గ్రామాలన్నింటినీ డిజిటలీకరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘ఈ-గ్రామ స్వరాజ్ ’’ పేరిట పోర్టల్‌ను, యాప్‌ను, ‘స్వామిత్వ యోజన’ పేరిట వెబ్‌సైట్‌ను ఆయన ఆరంభించారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది సర్పంచులతోనూ, గ్రామ సచివాలయ ప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆరంభించిన ఈ పోర్టల్ ద్వారా అన్ని పనులను ఎలకా్ట్రనిక్ మోడ్‌లో రికార్డు చేసి ఫోన్లలో అందుబాటులోకి తెస్తారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, పనుల పురోగతి, వర్క్-బేస్డ్ అకౌంటింగ్ అన్నీ ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా చేపట్టవచ్చు. పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా గ్రామ సచివాలయాల కార్యకలాపాలు డిజిటల్ మోడ్‌లో నిర్వహించవచ్చు.
గ్రామపంచాయతీ అభివృద్ధిని వికేంద్రీకరించి, దీనికి ఓ ప్రణాళిక (జీపీడీపీ)ను రూపొందించి, అమలు చేయవచ్చు. ఇక స్వామిత్వ యోజన ద్వారా గ్రామీణ స్థాయిలో ఆవాస భూములను డ్రోన్ల సహాయంతో, అధునాతన సర్వే పద్దతులతో మ్యాపింగ్ చేసే అవకాశం కలుగుతుంది. అంతేకాక ప్రణాళికలు ఒక పద్దతి ప్రకారం అమలయ్యేలా, రెవెన్యూ వసూళ్లు సక్రమంగా జరిగేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి హక్కులు సరిగా ఉండేలా చూస్తుంది. భూముల యజమానులు ఆర్థిక సంస్థల వద్ద రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఆస్తి వివాదాల్ని ఈ పథకం క్రింద జారీ చేసే టైటిల్ డీడ్స్‌తో పరిష్కరించవచ్చు. ‘కరోనా వైరస్ మన జీవన విధానాన్ని, పని చేసే శైలిని మార్చేసింది. ఈ వైరస్ నేర్పిన అతి పెద్ద పాఠం స్వావలంబన’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
♦️‘‘ప్రాథమిక అవసరాల కోసం ప్రజలు ఎవరి కాళ్లపై వారు నిలబడేట్లు చేసిన రోజులివి. దో గజ్ దేహ్ కీ దూరీ అంటే రెండు గజాల దూరం (భౌతికదూరం) పాటించడమని నిరూపించారు. ఇందుకు గ్రామీణ భారతావనిని అభినందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం యూపీలోని ఝాన్సీలో జరగాల్సినది, కానీ వైరస్ కారణంగా వాయిదాపడి- ఇపుడు వీడియో లింక్ ద్వారా జరిగింది. అనేక మంది గ్రామసచివాలయాల అధిపతులు తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మోదీ తన ముఖానికి పసుపచ్చటి రంగులో ఆకుపచ్చని చక్రాలు ముద్రించి ఉన్న గావంచా కట్టుకున్నారు. ఇక సింగపూర్‌కు కావాల్సిన నిత్యావసర సరుకులను, మందులను పంపుతామని భారత్ హామీ ఇచ్చింది. సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్‌తో మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడి కొవిడ్ 19 పరిస్థితిని చర్చించారు. ఈ వైరస్ విసిరిన సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు.
- ‘స్వామిత్వ యోజన’ వెబ్‌సైట్ ప్రారంభం
- డ్రోన్ల ద్వారా గ్రామ ఆస్తుల సేకరణసర్పంచులతో ప్రధాని డిజిటల్ భేటీ
- కరోనా నేర్పిన పాఠం.. స్వావలంబన,