ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 1.54 లక్షల మంది

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. దాదాపు అన్ని దేశాలను ఈ వైరస్‌ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాల్లో 5,72,076 మంది బాధితులు ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,50,683కు చేరింది.

అత్యధికంగా యూఎస్‌లో 37,158 మంది కరోనా బారిన పడి చనిపోయారు. స్పెయిన్‌లో 20,002, ఇటలీలో 22,745, ఫ్రాన్స్‌లో 18,681, జర్మనీలో 4,352, యూకేలో 14,576, చైనాలో 4,632, ఇరాన్‌లో 4,958, టర్కీలో 1,769, బెల్జియంలో 5,163, బ్రెజిల్‌లో 2,171, కెనడాలో 1,310, నెదర్లాండ్స్‌లో 3,459, స్విట్జర్లాండ్‌లో 1,327 మంది ప్రాణాలు కోల్పోయారు.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28