తెలంగాణలో 68 ఇంటర్ కాలేజీల మూసివేత

తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలను మూసివేస్తూ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా ఆయా కాలేజీలకు సమాచారం పంపింది. నిబంధనలు పాటించని, అనుమతులు లేని 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. అందులో 26 నారాయణ, 18 శ్రీచైతన్య కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జూనియర్ కాలేజీలు నిబంధనలు పాటించకపోవడంతో వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. దీంతో ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో అక్రమాలపై విచారణ చేపట్టి గుర్తింపులేని కాలేజీలను రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త రాజేశ్ దాఖలు చేసిన పిల్ మీద హైకోర్టు విచారణ జరిపి ఈ మేరకు ఇంటర్ బోర్డును ఆదేశించింది.కాలేజీల్లో అక్రమాలు జరగడంతో పాటు వాటికి ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎన్ఓసీలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ జరిపింది. అనంతరం నివేదికను హైకోర్టుకు అందించింది. వాస్తవానికి మార్చిలోనే వాటిని మూసేయాల్సి ఉంది. అయితే, అందులో 29,808 మంది విద్యార్థులు చదువుతుండడం, పరీక్షలు కూడా ఉండడంతో కొంత వాయిదా పడింది.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28