బ్యాక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేనివారికి నేరుగా నగదు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్యాంక్‌ ఖాతాలతో ఆధార్‌ కార్డు లింక్‌ లేని ఖాతాల్లో నగదు జమ కాలేదని, అటువంటి వారికి నేరుగా నగదు అందజేస్తామని తెలిపారు. 5 లక్షల 21 వేల 640 కార్డుదారులకు నగదును బ్యాంకుల్లో వేయలేకపోయాం. వారందరికీ నేరుగా, లేదా తపాలా ద్వారా లబ్ధిదారులకు నగదు అందజేస్తామని వెల్లడించారు.   వలస కార్మికులందరికీ 12 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి బియ్యం, కుటుంబానికి రూ.500 అందజేశామని తెలిపారు. బ్యాంకులో పడిన నగదు తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందన్న పుకార్లను నమ్మవద్దని ఆ నగదును ఎప్పుడైన తీసుకోవచ్చని తెలిపారు. బ్యాంకుల వద్ద జనం గుమికూడకుండా బౌతిక దూరం పాటించి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Popular posts from this blog

GK

GK

GK