డిటెన్షన్‌ నిబంధనల్లో మినహాయింపులు:ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయం

ఉన్నత విద్యామండలితో చర్చించిన తర్వాత ఖరారు

 హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో.. విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి డిటెన్షన్‌ నిబంధనల్లో కొంతమేర వెసులుబాటు కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. విశ్వ విద్యాలయం, అనుబంధ కళాశాలల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న డిటెన్షన్‌ నిబంధనల ప్రకారం 50శాతం సబ్జెక్టుల్లో విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి.  75శాతం హాజరు ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే పది శాతం మినహాయింపు లభిస్తుంది. మొత్తంగా 65శాతం కంటే హాజరు తక్కువైతే తర్వాతి సెమిస్టర్‌కు వెళ్లేందుకు విద్యార్థులకు అవకాశం ఉండదు. ఈ దఫా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా డిటెన్షన్‌ నిబంధనలను సరళీకరించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలితో చర్చించి ఎంత మేరకు వెసులుబాటు కల్పించాలనేది నిర్ణయిస్తామని రిజిస్ట్రార్‌ ప్రొ.సీహెచ్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు.
       

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28