ఈ ఏడాది చివరినాటికి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డీ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ భారీ నియామక పరీక్షను ఈ ఏడాది చివరినాటికి నిర్వహిస్తామని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) ప్రకటించింది. పరీక్షను నిర్వహించే ఏజెన్సీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశామని, ఏప్రిల్‌ 22న ఏజెన్సీని ఎంపికచేస్తామని, ఈ ప్రక్రియ మొత్తం మే 20 నాటికి ముగుస్తుందని ఆర్‌ఆర్‌బీకి చెందిన అధికారి అంగరాజ్‌ మోహన్‌ తెలిపారు.   
10,628 పోస్టులతో ఎన్‌టీపీసీ గ్రూప్‌-డీ నోటిఫికేషన్‌ను గతేడాది ఫిబ్రవరిలో ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. 2019, మార్చిలో దరఖాస్తుల గడువు ముగింసింది. ఈ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నోటిఫికేషన్‌ విడుదలై ఏడాది దాటినా పరీక్షలను మాత్రం నిర్వహించలేదు. 

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం