ఇంటర్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన బోర్డు..
సాదారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి వస్తాయి. కానీ ఈ యేడాది మాత్రం సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ముందు రాబోతున్నాయి. ఎంసెట్, జేఈఈ, డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండటంతో ముందుగా సెకండ్ ఇయర్ ఫలితాను విడుదల చేయనున్నారు. లాక్ డౌన్ తర్వాత వాల్యుయేషన్ ఎప్పుడు చెయ్యాలి అనే అంశంపై తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఈపాటికే వాల్యుయేషన్ మొదలయ్యేది. ఇప్పుడు కరోనా కారణంగా అది మొదలుకాలేదు. అందువల్ల మే 5 నుంచి లేదా 6 నుంచి వాల్యుయేషన్ చేపట్టి ముందుగా సెకండ్ ఇయర్ విద్యార్థుల పరీక్షా పేపర్లకు వాల్యుయేషన్ పూర్తి చెయ్యాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది.
ప్రభుత్వంతో మాట్లాడి ఫైనల్ నిర్ణయం ప్రకటించనుంది. ఎంసెట్‌తో పాటు జెఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలు జూన్‌లో జరిపేందుకు వేర్వేరు బోర్డులు రెడీ అవుతున్నాయి. అదే సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వేగంగా రిలీజ్ చేసేందుకు... ఇంటర్ బోర్డ్ త్వరపడుతోంది. ఒకేసారి ఎక్కువ మంది లెక్చరర్లతో వాల్యుయేషన్ జరిపి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇచ్చేందుకు బోర్డు సిద్దమవుతోంది.