కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ వర్సిటీల ఫ్రీ ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు

ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొనేందుకు ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, డ్యూక్, మిచిగాన్ సహా అంతర్జాతీయంగా ప్రముఖ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను అందించేందుకు నిర్ణయించాయి. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (మూక్స్) విధానంలో అందించే ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు, క్రెడిట్లు అందిస్తాయి. ఈ క్రెడిట్లకు భవిష్యత్తులో ప్రాధాన్యం కూడా దక్కనుంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఈ ఉచిత ఆన్‌లైన్ కోర్సుల అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆ క్రెడిట్లతో ప్రయోజనం పొందగలుగుతారని రాష్ట్ర విదేశీవిద్య కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు పేర్కొన్నారు.ప్రీ ఆన్‌లైన్ కోర్సుల్లో ముఖ్యమైన కేటగిరీలు
కంప్యూటర్ సైన్సు; బిజినెస్; ఇంజనీరింగ్; హెల్త్ అండ్ మెడిసిన్; హ్యుమానిటీస్; డేటా సైన్స్; పర్సనల్ డెవలప్‌మెంట్; ఆర్ట్ అండ్ డిజైన్ ప్రోగ్రామింగ్; మేథమెటిక్స్; సైన్స్; సోషల్ సెన్సైస్.

ఈ విభాగాల్లోనూ పలు స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి.

స్టాన్‌ఫోర్డ్, జార్జియాటెక్, యేల్, డ్యూక్, మిచిగాన్ వంటి అనేక వర్సిటీలలొ దాదాపు 178 మూక్స్ సర్టిఫికేషన్ కోర్సులు.

ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్న వర్సిటీలు 50.

వీటిలో పెన్, జార్జియాటెక్, జాన్స్ హాకిన్స్, కాల్‌టెక్, డ్యూక్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటివి ఉన్నాయి.

180 రోజుల్లో పూర్తయ్యేలా ఈ సర్టిఫికేషన్ కోర్సులకు ఈ ఏడాది మే ఆఖరు వరకే అవకాశం ఉంది.

ఇవే కాకుండా గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.

ఈ కోర్సుల వ్యవధి వారంలో 5 నుంచి 10 గంటలవరకు మాత్రమే ఉంటుంది.


కొన్ని ముఖ్య కోర్సులు
అందిస్తున్న వర్సిటీలు
హెల్త్ మెడిసిన్
న్యూక్యాజిల్, యూనివర్సిటీ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూ,మొనాష్ యూనివర్సిటీ
డిసీజ్, డిజాస్టర్
వర్సిటీ ఆఫ్ సామానియా, వేజినింజన్ వర్సిటీ, కేంబ్రిడ్జ్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్రొనింజెన్
పబ్లిక్ హెల్త్
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, జాప్ హాకిన్స్ యూనివర్సిటీ, పెన్సెల్వేనియా స్టేట్ యూనివర్సిటీ, వర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్
హెల్త్‌కేర్
కేప్‌టౌన్ యూనివర్సిటీ, వర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, వర్సిటీ ఆఫ్ లీ డ్స్, హార్వర్డ్ మెడికల్ స్కూల్
నర్సింగ్
జార్జియా వాషింగ్‌టన్ యూనివర్సిటీ, జాప్ హాకిన్స్ వర్సిటీ, వర్సిటీ ఆఫ్ ఆంగ్లియా, వర్సిటీ ఆఫ్ కొలరాడో సిస్టమ్
వెటర్నరీ సైన్స్
వర్సిటీ కంప్లూటెన్స్ మాడ్రిడ్, వర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్, వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ వర్సిటీ, వర్సిటీ ఆఫ్ టన్నెస్సీ
అనాటమీ
యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, యేల్ యూనివర్సిటీ, వర్సిటీ ఆఫ్ గ్లాస్గోవ్, హార్వర్డ్ యూనివర్సిటీ

ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్: ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని  వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. click here to website

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం