ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో ఉంచినట్లు ఆయన చెప్పారు.

                  ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఇంగ్లీష్‌, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్‌, ఫిలాసఫీ, మరాఠీ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఎంకాం ప్రధమ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం